చైతూతో సామ్ ప్రమోషన్స్? క్లారిటీ ఇదిగో!
మూవీ టీమ్ కు సంబంధించిన ఎవరితో కూడా తాను ప్రమోట్ చేయడం లేదని సమంత తెలిపారు. అలాంటి వార్తలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదన్నారు.;
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత కలిసి నటించిన ఏ మాయ చేసావే మూవీ గురించి అందరికీ తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. సామ్, చైతూకు స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది కూడా.
అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఏ మాయ చేసావే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. జూలై 18వ తేదీన రీ రిలీజ్ కానుంది. దీంతో సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారని.. ఆ సమయంలో సమంత, నాగచైతన్య కలిసి పాల్గొంటారని జోరుగా ప్రచారం జరిగింది.
మీడియా ఇంటరాక్షన్ లో మూవీ టీమ్ పాల్గొనే ఛాన్స్ ఉంటుందని, అప్పుడు చైతూ, సామ్ ను కలిసి ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం ఉందని టాక్ వినిపించింది. దీంతో ఇప్పుడు సమంత.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆ విషయంపై స్పందించారు. ఏ మాయ చేసావే ప్రమోషన్స్ విషయంలో కూడా అందరికీ క్లారిటీ ఇచ్చారు సామ్.
మూవీ టీమ్ కు సంబంధించిన ఎవరితో కూడా తాను ప్రమోట్ చేయడం లేదని సమంత తెలిపారు. అలాంటి వార్తలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదన్నారు. తాను ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నానని చెప్పిన సమంత.. అలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో తెలియదని అన్నారు. కానీ ఫ్యాన్స్ ఆలోచన తప్పులేదన్నారు.
ఎందుకంటే.. సినిమాలో నటించిన వారు కలిసి మూవీని ప్రమోట్ చేస్తే చూడాలని అభిమానులు అనుకుంటారని చెప్పారు సామ్. కానీ ప్రేక్షకుల దృష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్న సమంత.. ఏ మాయ చేసావే తొలి షాట్ ను ప్రస్తావించారు.
ఆ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు బాగా గుర్తున్నాయని తెలిపిన సామ్.. జెస్సీ, కార్తీక్ పై షూట్ చేసిన ఇంటి గేటు సీన్ తన తొలి షాట్ అని వెల్లడించారు. తన కెరీర్ స్టార్టింగ్ లో గౌతమ్ మీనన్ వంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎంతో హ్యాపీ అని చెప్పారు. కాగా.. ఆ మూవీతోనే సామ్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. డెబ్యూతో సూపర్ హిట్ అందుకుని సత్తా చాటారు.