• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అయ్యో.. ఆ హీరో ఫ్యాన్స్...

అయ్యో.. ఆ హీరో ఫ్యాన్స్ రవితేజనే తిడుతున్నారా?

| దీంతో సోషల్ మీడియాలో రవితేజపై యశ్ ఫ్యాన్స్ కాస్త మండి పడుతున్నారు. రవితేజ అలా అనడం సరికాదని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-11 11:37 GMT

టాలీవుడ్​ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కన్నడ రాకింగ్ స్టార్ యశ్​ అభిమానులు రవితేజ విషయంలో హర్ట్ అవుతున్నారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫైర్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కెరీర్​లోనే మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఈ క్రమంలోనే బాలీవుడ్​లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. యాంకర్ ముందు కొంతమంది సౌత్ సూపర్ స్టార్స్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన రవితేజ... చరణ్​ చాలా మంచి డాన్సర్ అని ప్రశంసించారు. ప్రభాస్​ డార్లింగ్ అని, దర్శకధీరుడు రాజమౌళిలో విజన్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. కన్నడ హీరో యశ్ గురించి చెప్పమని అడగగా.. "కేజియఫ్ చిత్రం మాత్రమే తాను చూశానని, అతడికి కేజీయఫ్​ లాంటి సినిమా పడటం లక్కీ అని" తెలిపారు. అయితే ఈ కామెంట్స్​ విన్న యశ్ ఫ్యాన్స్​ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో రవితేజపై యశ్ ఫ్యాన్స్ కాస్త మండి పడుతున్నారు. రవితేజ అలా అనడం సరికాదని అంటున్నారు.

కాగా, 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా విషయానికి వస్తే.. స్టువర్ట్​పురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు బయోపిక్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్​ రవితేజ సరసన హీరోయిన్లుగా నటించారు. వంశీ డైరెక్షన్​లో సినిమా తెరకెక్కింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్​పై సినిమాను నిర్మించారు.

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్​లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • Tollywood 
  • Tigernageswararao 
  • Tigernageswararaomovie 
  • Raviteja 
  • Yash 
  • Fans 
  • Socialmedia 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS