'రామాయణం' ట్రైలర్‌లో ఏకైక షో స్టాపర్ యష్ విశ్వరూపం న‌భూతోన‌భ‌విష్య‌తి

ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నా.. తన అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్, అభినయంతో యష్ ఏకైక `షో స్టాపర్`గా నిలిచారు.

Update: 2026-07-30 04:16 GMT

నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణ` ట్రైలర్ విడుదలవుతూనే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. గతంలో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ శ్రీరాముడి పాత్రను కొంత హైలైట్ చేసినా..తాజాగా విడుద‌లైన‌ సుదీర్ఘమైన ట్రైలర్ మాత్రం లంకాధిపతి రావణుడిగా నటిస్తున్న యష్ ప్రదర్శనతోనే పూర్తిగా నడిచింది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నా.. తన అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్, అభినయంతో యష్ ఏకైక `షో స్టాపర్`గా నిలిచారు.

ట్రైలర్ రావణుడి పాత్రతో ప్రారంభ‌మ‌వ్వ‌డం ప్రేక్షకులను ఒక రకమైన ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఎంతో మంది నటులు రావణాసురుడి పాత్రను పోషించినా.. యష్ అందించిన శైలి- సంభాష‌ణాచాతుర్యం ఎంతో భిన్నంగా, అత్యంత ప్రత్యేకంగా ఉంది. అత‌డిలోని భయానక రూపం .. విజువల్స్‌లో కనిపించిన భయంకరమైన యాక్షన్ సన్నివేశాలు రావణుడి పాత్ర ఎంత శక్తివంతంగా ఉండబోతోందో స్పష్టం చేశాయి.

రావణుడి పాత్రకు కావలసిన గంభీరమైన శ‌రీరాకృతి- రాజసం యష్ రూపంలో పరిపూర్ణంగా ఒదిగిపోయాయి. శ్రీరాముడి పాత్ర శాంతానికి, ధర్మానికి ప్రతీకగా నిలిస్తే... దానికి పూర్తి భిన్నంగా అత్యంత అహంకారి అయిన లంకాధిపతిగా యష్ చూపించిన హావభావాలు, నడక, గంభీరత్వం అద్భుతమైన కాంట్రాస్ట్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా బిగ్ స్క్రీన్‌పై 3డి ఫార్మాట్‌లో యష్ రాక్షస రూపం, రాజసం నెక్స్ట్ లెవెల్ అనుభూతిని ఇస్తాయనడంలో సందేహం లేదు.

ఇక సంభాషణల విషయానికి వస్తే.. యష్ తనదైన గంభీరమైన స్వరంతో రాక్షసత్వాన్ని, అహంకారాన్ని పండించారు. ముల్లోకాలనూ శాసించే ఏకైక చక్రవర్తిగా అత‌డు గర్జించే తీరు, డైలాగ్ డెలివరీలో చూపించిన తీవ్రత రావణుడి పాత్రలోని అపారమైన శక్తిని ప్రతిబింబించాయి. రాకింగ్ స్టార్ య‌ష్‌ పలికిన ప్రతి సంభాషణ థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని అందించేలా పండిందంటే అతిశ‌యోక్తి కాదు. అలాగే య‌ష్ కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆభ‌ర‌ణాలు గ్రాండియారిటీని మ‌రింత ఉత్త‌మ స్థానానికి తీసుకెళ్లాయి. లంక వైభ‌వం- పుష్ప‌క‌విమానం మ‌రో ప్ర‌ధాన అస్సెట్.

మొత్తానికి `రామాయణ` ట్రైలర్‌లో ఇతర పాత్రలు ఎన్ని ఉన్నా.. కథనాన్ని, గ్రాండియారిటీని.. అంచనాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లింది మాత్రం యష్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పురాణేతిహాసంలోని పౌరాణిక‌ పాత్రను అత్యంత శక్తివంతంగా... విలక్షణమైన శైలిలో ఆవిష్కరించి యష్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దీపావళికి విడుదల కానున్న ఈ ఎపిక్ సాగాలో యష్ నటన ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిపోనుందని ఈ ట్రైలర్ నిరూపించింది. య‌ష్ ని ఈ ట్రైల‌ర్ ఒక అంత‌ర్జాతీయ స్థాయి న‌టుడిగా నిరూపించింది అంటే అతిశ‌యోక్తి కాదు.

Tags:    

Similar News