సముద్ర తీరాన ల్యాండ్ కొనుగోలు చేసిన యష్ - రాధిక దంపతులు.. ఖరీదు ఎంతంటే?

కన్నడ సినీ పరిశ్రమలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న యష్ , రాధిక దంపతుల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-06-03 07:11 GMT

కన్నడ సినీ పరిశ్రమలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న యష్ , రాధిక దంపతుల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమా ఈవెంట్ అయినా.. సెలబ్రిటీల పెళ్లిళ్లయినా ఈ జంట సందడి చేయాల్సిందే. అంతలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ జంట.. తాజాగా సముద్ర తీరాన ఖరీదైన ల్యాండ్ ను కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక సముద్ర తీర భూమిని ఈ జంట కొనుగోలు చేయడంతో దాని ఖరీదు ఎంత? ఇతర వివరాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మహారాష్ట్రలో ముంబై తర్వాత అత్యంత ప్రజాధారణ పొందిన ఖరీదైన ప్రాంతంగా పిలువబడే అలీబాగ్ లో సముద్ర తీరంలోని ఒక ప్రీమియం భూమిని ఈ జంట కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన లియాసెస్ ఫోరాస్ తెలిపిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. రాయగడ్ జిల్లా, అలీబాగ్ తాలూకా, కామత్ గ్రామంలో పక్కపక్కనే ఉన్న రెండు వ్యవసాయ భూములను సుమారుగా రూ.24 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. 2026 మే 18న అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సుమారుగా 5, 289 చదరపు మీటర్లు అంటే 0.5289 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన వ్యవసాయ భూమిని వీరు కొనుగోలు చేశారు. ఇక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ప్రకారం.. కిహిమ్ బీచ్ కి ఆనుకొని ఉన్న కామత్ గ్రామంలో చిన్న మార్కెట్ కి సమీపంలో ఈ భూమి ఉంది. ఈ ఉమ్మడి ఆస్తికి తూర్పు వైపున గ్రామ రహదారి , పశ్చిమ వైపున సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఇకపోతే కొనుగోలుదారులు స్టాంపు డ్యూటీ కింద రూ.1.4కోట్లు , రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.60,000 , డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ చార్జీల కింద రూ.5,200 చెల్లించినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఈ కొత్త ప్రాపర్టీ కొనుగోలుతో యష్ తన ఆస్తులను విస్తరించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆయనకున్న ఇతర ఆస్తుల విషయానికొస్తే.. ఇప్పటివరకు సుమారుగా ఆయనకు రూ.60 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని అంచనా.. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత ఒక్కో సినిమాకి సుమారుగా రూ.20 నుండి రూ.30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక బెంగళూరులోని నంది హిల్స్ సమీపంలో ఉన్న ప్రెస్టీజ్ గోల్ఫ్ షైర్ లో ఈయనకు లగ్జరీ డూప్లెక్స్ ఇల్లు ఉంది . దీని విలువ సుమారుగా రూ.6 కోట్లు.

అలాగే కార్ కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ.3 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ ఎం 350h, రూ.2.60 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ అలాగే బీఎండబ్ల్యూ ఎక్స్ 5 వంటి కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఏదేమైనా సినిమాలు , యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఆస్తుల రూపంలో విస్తరించుకుంటున్నారని చెప్పవచ్చు.

Tags:    

Similar News