పాన్ ఇండియా స్టార్.. ఆ ట్యాగ్ శాశ్వతం కాదు

కన్నడ స్టార్ యష్ పేరు ఇప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ప్రత్యేకంగా వినిపిస్తోంది.

Update: 2026-08-16 16:30 GMT

కన్నడ స్టార్ యష్ పేరు ఇప్పుడు ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ప్రత్యేకంగా వినిపిస్తోంది. సాధారణ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన.. ఎలాంటి సినీ వారసత్వం లేకుండానే తనకంటూ ఓ భారీ మార్కెట్‌ను నిర్మించుకున్నారు. అయితే తన జ‌ర్నీని ఇతర స్టార్ హీరోలతో పోల్చుకునే విషయంలో మాత్రం యష్ ఎప్పుడూ ఆచితూచి మాట్లాడుతుంటారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మతో జరిగిన సంభాషణలోనూ ఇదే వైఖరి కనిపించింది.

సౌత్ ఇండియన్ సినిమాకు చెందిన పలువురు అగ్ర హీరోల పేర్లను ప్రస్తావించిన రజత్ శర్మ.. వారిలో చాలామంది ప్రముఖ సినీ కుటుంబాల నుంచి వచ్చారని పేర్కొన్నారు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, విజయ్ వంటి స్టార్లకు ఇప్పటికే స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని చెబుతూ, యష్ మాత్రం ఎలాంటి సినీ వారసత్వం లేకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు.

అయితే ఈ సందర్భాన్ని తన గొప్పతనాన్ని చాటుకునేందుకు యష్ ఉపయోగించుకోలేదు. తనతో పాటు ప్రస్తావించిన హీరోలందరూ తమ కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొంటూ వారి విజయాలను గౌరవించారు. అంతేకాదు.. పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపు గురించి కూడా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఒకసారి వచ్చిన ట్యాగ్‌తోనే ఎప్పటికీ స్టార్‌డమ్ కొనసాగుతుందని భావించకూడదని, స‌క్సెస్‌లు, సిట్యుయేష‌న్స్ కాలానుగుణంగా మారుతుంటాయని యష్ అభిప్రాయపడ్డారు.

యష్ మాటల్లోని ఈ ఆలోచనా విధానం ఆయన కెరీర్‌ను చూస్తే మరింత స్పష్టమవుతుంది. కర్ణాటకలో సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన తొలినాళ్లలో థియేటర్, టెలివిజన్‌లో పనిచేస్తూ యాక్ట‌ర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ సినిమాలు ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా రెండు పార్ట్‌ల భారీ స‌క్సెస్ యష్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన మార్కెట్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టాక్సిక్, రాయామ‌ణ వంటి భారీ ప్రాజెక్టులతో యష్ మరింత భారీ స్థాయిని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయినప్పటికీ తన స్టార్‌డమ్‌పై అతిశయోక్తికి తావివ్వకుండా.. రెగ్యుల‌ర్ గా వ‌ర్క్ చేయ‌డ‌మే అస‌లైన స‌క్సెస్ కు మార్గమని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News