ఈ సినిమా ప్రకటించాక ముగ్గురు తల్లులయ్యారు
కొన్ని సినిమాలను ప్రకటించడం ఎంత సులువో, పూర్తి చేయడం అంత కష్టం. ఇదే కేటగిరీకి చెందుతుంది ఫర్హాన్ అక్తర్ `జీలే జరా`.;
కొన్ని సినిమాలను ప్రకటించడం ఎంత సులువో, పూర్తి చేయడం అంత కష్టం. ఇదే కేటగిరీకి చెందుతుంది ఫర్హాన్ అక్తర్ `జీలే జరా`. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల కథతో ఈ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. దీనికోసం ప్రియాంక చోప్రా, కత్రిన కైఫ్, ఆలియా భట్ లను ఫర్హాన్ ఎంపిక చేసుకున్నాడు. 2021లో ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ ఇది ఐదేళ్లు అయినా ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు.
పలుమార్లు ఫర్హాన్ అక్తర్ తాను ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. కానీ అది పదే పదే వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు మరోసారి ఫర్హాన్ చాలా నమ్మకంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నామని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
అయితే మొదటి నుంచి ఈ ప్రాజెక్టు ఆలస్యం అవ్వడానికి ప్రధాన సమస్య ఏమిటి? అని ప్రశ్నించగా ఫర్హాన్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసారు. ఈ సినిమా కోసం ముగ్గురు పెద్ద తారలను ఎంపిక చేయడంతో వారి కాల్షీట్లను సర్ధుబాటు చేయడం సంక్లిష్ఠంగా మారింది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఆ ముగ్గురి జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. ఆ ముగ్గురూ తల్లులు కూడా అయ్యారు. ప్రియాంక హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయింది. ఆలియా, కత్రిన పెళ్లిళ్లు అయ్యాయి. తర్వాత వీరంతా పిల్లల్ని కూడా కన్నారు. దీనికి అనుగుణంగా వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఇవి మాత్రమే కాదు .. ఆ ముగ్గురికి ముగ్గురు పెద్ద హీరోలు కావాలని కూడా రచయితలు రీమా కగ్తీ, జోయా అక్తర్ కోరారు. హీరోల ఎంపిక పెద్ద సవాల్ గా మారిందని ఫర్హాన్ తెలిపారు. అయితే ఎట్టకేలకు అన్ని సమస్యలను పరిష్కరించుకుని దర్శకుడు ఫర్హాన్ ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను చాలా అలసిపోయానని కూడా ఫర్హాన్ వెల్లడించారు. ``అన్నిటినీ పరిష్కరించాము... త్వరలో ప్రారంభిస్తాం`` అని ఆయన అన్నారు.
2021లో సినిమా ప్రకటన తర్వాత నటీమణులు ఎదుర్కొన్న జీవిత మార్పులు ఆలస్యానికి తోడయ్యాయి. సినిమా ప్రకటన తర్వాత ముగ్గురు నటీమణులు తల్లులు అయ్యారు. కత్రినా కైఫ్ , అలియా భట్ కూడా వివాహం చేసుకున్నారు.స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే అరుదైన లేడీ ఫ్రెండ్స్ రోడ్ ట్రిప్‌ను ఊహించి 2019లో అర్థరాత్రి ఫోన్ కాల్ చేసినప్పుడు ప్రియాంక తనకు ఓకే చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రయాణం మొదలైందని ఫర్హాన్ తెలిపాడు.