యాంకర్ సుమకి డైరెక్టర్ ఛాలెంజ్.. సీరియస్ గా తీసుకున్నాడంటే..?

ఐతే తను ఇంటర్వ్యూ చేస్తున్న సెలబ్రిటీస్ తో తనకున్న చనువు కొద్దీ ఆమె కాస్త వాళ్లని క్రాస్ ఓవర్ చేస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆమె చేసే ర్యాగింగ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.;

Update: 2026-01-29 06:07 GMT

సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ అంటే అందరికీ గుర్తొచ్చే యాంకర్ సుమ మాత్రమే. ఆమె డేట్స్ ఖాళీ లేకనో లేదా ఆమె కాదంటే తప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ వేరే వాళ్ల దగ్గరకు వెళ్లవు. దాదాపు రెండు దశాబ్దాలుగా సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఐతే తను ఇంటర్వ్యూ చేస్తున్న సెలబ్రిటీస్ తో తనకున్న చనువు కొద్దీ ఆమె కాస్త వాళ్లని క్రాస్ ఓవర్ చేస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆమె చేసే ర్యాగింగ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

అనుదీప్ సుమ మధ్య కామెడీ..

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో సుమ మధ్య జరిగే కామెడీ ఆడియన్స్ ని అలరిస్తుంది. త్వరలో ఫంకీ సినిమాతో రాబోతున్న అనుదీప్ రీసెంట్ గా ఆ సినిమా హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కయదు లోహర్ తో కలిసి సుమ ఇంటర్వ్యూ చేసింది. అనుదీప్ కూడా అందులో పాల్గొన్నాడు. సుమ తన ఫోకస్ మొత్తం అనుదీప్ మీదే పెట్టినట్టు అనిపించింది. విశ్వక్ కూడా అనుదీప్ గురించి చెబుతూ మేమెంత చేసినా సరే క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకుంటాడని అన్నాడు.

ఐతే ఈ ఇంటర్వ్యూలోనే ఫంకీలో రొమాంటిక్ సీన్స్ గురించి సుమ అడిగితే.. అబ్బో ఒక రేంజ్ లో ఉన్నాయని విశ్వక్ సేన్ అన్నాడు. ముందు హీరో హీరోయిన్ కన్నా అనుదీప్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా తనకి కట్ చెప్పాడని హీరోయిన్ అన్నది. ఐతే అనుదీప్ తో జర జర జలపాతం సాంగ్ డైరెక్ట్ చేయిస్తే జ్వరం వస్తుందేమో అని సుమ అన్నది. ఐతే దానికి అనుదీప్ సమాధానం ఇస్తూ సినిమాకు అవసరం అంటే అలాంటి సాంగ్ కూడా చేస్తానని అన్నాడు.

నెక్స్ట్ సినిమాలో అలాంటి సాంగ్ తీసి చూపిస్తా..

నెక్స్ట్ సినిమాలో అలాంటి సాంగ్ తీసి చూపిస్తా అని సుమ తో చెప్పాడు అనుదీప్. పైకి అతని కామెడీగా అన్నా సరే సుమ చేసిన కామెంట్ ని అనుదీప్ సీరియస్ గా తీసుకున్నాడనే అనిపిస్తుంది. అనుదీప్ కి కామెడీ మీద మంచి పట్టు ఉంది. అతని వన్ లైనర్స్ ఇంకా కథతో నడిపించే కామెడీ అదరగొట్టేస్తుంది. అది నచ్చే అనుదీప్ సినిమా అంటే ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.

విశ్వక్ సేన్ తో ఫంకీ అంటూ ఒక సూపర్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు. ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే సందర్భంగా వస్తున్న ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ నెక్స్ట్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. విశ్వక్ తో ఫంకీ అంటూ మరో ఎంటర్టైనింగ్ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలాంటి ఫన్ బ్లాస్టర్ అనిపించుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News