ప్రభాస్ కు హీరోయిన్ ను సెట్ చేస్తున్న ఫ్యాన్స్
మృణాల్ ప్రభాస్ పక్కన అందంగా ఉండటమే కాకుండా తను మంచి నటి కూడా. పైగా మృణాల్ సౌత్ ఆడియన్స్ కే కాకుండా నార్త్ ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ హైప్ ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణెను ముందు హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఇప్పుడు దీపికా ఈ ప్రాజెక్టులో నటించడం లేదని తెలుస్తోంది. దీంతో మేకర్స్ స్పిరిట్ లో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
ప్రభాస్ పక్కన హీరోయిన్ అంటే పొడవైన అమ్మాయి అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ హీరోయిన్ పేరును సూచిస్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు. మృణాల్ ఠాకూర్. ఇప్పటివరకు ఈ ఇద్దరూ కలిసి నటించింది లేదు. మృణాల్, ప్రభాస్.. కల్కి 2898ఏడీలో నటించినప్పటికీ వారిద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నది అయితే లేదు.
తెలుగులో మృణాల్ కు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ లో మృణాల్ అయితే బావుంటుందని, ప్రభాస్ పక్కన మృణాల్ లాంటి పొడవైన, అందమైన హీరోయిన్ అయితే సెట్ అవుతుందని సూచిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పినట్టు స్పిరిట్ సినిమాకు మృణాల్ ను తీసుకుంటే అది మంచి సెలెక్షనే అవుతుంది.
మృణాల్ ప్రభాస్ పక్కన అందంగా ఉండటమే కాకుండా తను మంచి నటి కూడా. పైగా మృణాల్ సౌత్ ఆడియన్స్ కే కాకుండా నార్త్ ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలు. మృణాల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కూడా బాలీవుడ్ లోనే కాబట్టి స్పిరిట్ కు మార్కెట్ పరంగా కూడా మృణాల్ ను తీసుకుంటే కాస్త హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. దాంతో పాటూ మృణాల్ కు తెలుగు భాషపై కూడా పట్టు ఉంది కాబట్టి అవసరమైతే డబ్బింగ్ కూడా చెప్పే ఛాన్సుంది. మరి స్పిరిట్ విషయంలో సందీప్ ఏం ఆలోచిస్తున్నాడనేది తెలియాల్సి ఉంది.
సందీప్ స్పిరిట్ మార్కెట్ పెంచాలనుకునే హీరోయిన్ కోసం చూస్తుంటే మాత్రం మృణాల్ గురించి ఆలోచించకపోవచ్చు. అలా కాకుండా ఎవరైనా పర్లేదు అనుకుని మార్కెట్ ను పట్టించుకోకపోతే మాత్రం స్పిరిట్ కు మృణాల్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ కోసం కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ రుక్మిణి ఎన్టీఆర్‌నీల్ ప్రాజెక్టు తో డీల్ కుదుర్చున్న నేపథ్యంలో ఒకవేళ రుక్మిణికి ఆఫర్ వెళ్లినా తను చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి స్పిరిట్ లో ప్రభాస్ పక్కన ఎవరు నటిస్తారనేది తెలుసుకోవడానికి అందరూ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు.