బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయా? ఇండస్ట్రీ నెంబర్ వన్ అయ్యే హీరోలు ఎవరు?
ఇతర భాషల హీరోల కంటే మన హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంది. కాబట్టి మనవాళ్ళే టాప్ పొజిషన్ కి చేరుకునే అవకాశమైతే ఉంది.
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మన ఇండస్ట్రీ అందుకుంటున్న సక్సెస్ లను చూస్తుంటే ఇప్పుడే కాదు రాబోయే మరికొన్ని సంవత్సరాల పాటు ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలారు. సౌత్ సినిమాలన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పిన వాళ్ళకి అసలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదనే చాలామంది ఫోకస్ చేస్తున్నారు. మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇతర భాషల దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ లేని ఖ్యాతి దక్కుతుంది. ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా మారే హీరో ఎవరు అనే దానిమీద కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ను భర్తీ చేయగలిగే హీరోలు ఎవరు కనిపించడం లేదు. కాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నైనా మన తెలుగు హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే పాన్ ఇండియాలో బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఇతర భాషల హీరోల కంటే మన హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంది. కాబట్టి మనవాళ్ళే టాప్ పొజిషన్ కి చేరుకునే అవకాశమైతే ఉంది. ఈ విషయంలో ప్రభాస్ కొంచెం ముందు వరుసలో ఉన్నాడు.
ఇప్పటివరకు ఈ తెలుగు హీరో చేయనన్ని ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. బాహుబలి రెండు పార్టులతో పాటు సలార్, కల్కి లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. అల్లు అర్జున్ లాంటి నటుడు కూడా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే అవకాశమైతే ఉంది. 'పుష్ప 2' సినిమాతో 1900 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సైతం రాబోయే సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాలనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి వాళ్లు కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను ఈజీగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' సినిమా 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు.
ఈ సినిమా కనక భారీ రికార్డులను కొల్లగొట్టినట్లయితే మహేష్ బాబు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారుతాడనేది వాస్తవం... ఇక వీళ్లలో ఎవరు నెంబర్ వన్ హీరో గా మారతారు అనేది తెలియాలంటే మాత్రం మరో మూడు, నాలుగు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది... ఎందుకంటే ఒకటి రెండు సక్సెస్ లతో ఎవరిని ఇండస్ట్రీ నెంబర్ వన్ గా గుర్తించలేము... కంటిన్యూస్ గా సక్సెస్ లను సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ, ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోలు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటారు. నటనతో పాటు డ్యాన్స్ ఫైట్ లతో అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించాలి. అన్నింటిలో ఆల్ రౌండర్ అయి ఉండాలి... అలాంటి వాళ్ళకే నెంబర్ వన్ చైర్ దక్కుతుంది...