శతమానం భవతి 2.. రాజుగారి ప్లాన్ లో బిగ్ చేంజ్

ఇక దిల్ రాజు కు చిన్న సినిమాలలో అత్యధిక లాభాలు అందించింది సినిమాలలో శతమానం భవతి ఒకటి

Update: 2024-03-02 09:08 GMT

దిల్ రాజు ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమాను వెండితెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక సంక్రాంతి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కొన్ని కథలను వేగంగా పూర్తి చేయడంలో ఆయన స్టైలే వేరు. ఇక దిల్ రాజు కు చిన్న సినిమాలలో అత్యధిక లాభాలు అందించింది సినిమాలలో శతమానం భవతి ఒకటి. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుదలైంది.

శర్వానంద్ అనుపమ ఈ సినిమాల్ జంటగా నటించగా ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అయితే మళ్ళీ శతమానం భవతి సీక్వెల్ ను మరో సంక్రాంతికి కొత్త తరహా కథలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఆ కథను అందించబోయేది కూడా దిల్ రాజు అనే తెలుస్తోంది.

దిల్ రాజు తన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత ఐడియాలు ఉండేలా చూసుకుంటాడు. కానీ టైటిల్స్ లో మాత్రం తన పేరును వేసుకోవడం ఎప్పుడు కనిపించ లేదు. కేవలం నిర్మాతగానే ఉండాలని అనుకుంటారు. ఇక ఈసారి మాత్రం శతమానంభవతికి మేజర్ కథను ఆయన ఐడియాలతోనే డెవలప్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు కాంపౌండ్ లో చాలా రోజులుగా అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్న హరి అనే కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం ఇస్తాడు అని తెలుస్తుంది.

Read more!

అతను ఎక్కువగా వంశీ పైడిపల్లి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. మహర్షి, వారిసు లాంటి స్క్రిప్ట్ లలో అతని హ్యాండ్ కూడా ఉన్నట్లు టాక్. ఇక ఈసారి దిల్ రాజు అతన్ని నమ్మి శతమానం భవతి సీక్వెల్ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. క్యాస్టింగ్ విషయంలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందట.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాలో సంక్రాంతికి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు. అయితే మరోవైపు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందే సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలి అని దిల్ రాజు దిల్ రాజు అనుకున్నాడు. మరి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తాయా? లేదంటే రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వకుండా ఆ పండక్కే వారం గ్యాప్ లో దింపుతారా? అనేది తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News