స‌వాళ్లు ఎదుర్కొంటున్న క్రేజీ సీక్వెల్

అప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ర‌క్తి క‌ట్టించిన ఫ్రాంఛైజీలో కొత్త‌ సీక్వెల్ రూపొందించ‌డం అంటే నిజంగా ద‌ర్శ‌కుడికి క‌త్తి మీద సాము లాంటిదే.;

Update: 2025-04-13 06:51 GMT

అప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ర‌క్తి క‌ట్టించిన ఫ్రాంఛైజీలో కొత్త‌ సీక్వెల్ రూపొందించ‌డం అంటే నిజంగా ద‌ర్శ‌కుడికి క‌త్తి మీద సాము లాంటిదే. మునుప‌టి టింజ్ ని తిరిగి తెర‌పైకి తీసుకు రాక‌పోతే ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ నుంచి చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు క‌థ‌కు కొన‌సాగింపు తో పాటు, పాత్ర‌లు పాత్ర‌ధారుల్లో సింక్ చాలా ముఖ్యం. దాంతో పాటు, ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌లేదు! అనేంత కొత్త‌ద‌నం సీక్వెల్ క‌థ‌లో చూపించాల్సి ఉంటుంది.

కానీ ఇవేవీ టీజ‌ర్ లో క‌నిపించ‌నందున‌ `వెల్ కం` ఫ్రాంఛైజీలో మూడో భాగంపై చాలా క్రిటిసిజం ఎదుర‌వుతోంది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ స‌హా 20 మందికి పైగా దిగ్గ‌జ న‌టీన‌టుల‌తో కొత్త పార్ట్ తెర‌కెక్కించాల‌ని అహ్మ‌ద్ ఖాన్- ఫ‌ర్హాద్ సామ్జీ పెద్ద ప్లాన్ వేసినా అది వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. `వెల్‌కం- 3`కి సంబంధించి స‌రైన అప్ డేట్ లేక‌పోవ‌డంతో తీవ్ర‌ అనిశ్చితి వెంటాడుతోంది. ఈ సినిమా ఖాన్ - సామ్జీల పనిత‌నానికి అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుంది.

చాలా గ్యాప్ రావ‌డంతో పాటు అనీల్ క‌పూర్, నానా ప‌టేక‌ర్ లాంటి స్టార్లు లేక‌పోవ‌డంతో జ‌నం దీనికి క‌నెక్ట్ కావ‌డం అంత సులువేమీ కాదు. అయినా చిత్ర‌బృందం ప్ర‌య‌త్నం ఆప‌లేదు. ప్ర‌స్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ విడుదల షెడ్యూల్ లాక్ అయింది. అయితే ఫ్రాంఛైజీలో మునుప‌టి టింజ్ ని ఈ కొత్త సినిమా తేగ‌లుగుతుందా? పాత్ర‌ధారులు కామెడీని అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రిస్తారా లేదా? ఫ‌ర్హాద్ సామ్జీ క‌థాంశంతో మ్యాజిక్ చేసాడా లేదా? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. సీక్వెల్ కి ఎదుర‌య్యే అన్ని ఛాలెంజ్ ల‌ను అధిగ‌మించి ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు స‌రైన సినిమాని అందిస్తారే అంతా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News