వార్ 2లో రొమాంటిక్ లవ్.. ప్రోమోతోనే హింట్ ఇచ్చారుగా..

ఇండియన్ సినిమా ప్రపంచంలో సరికొత్త రికార్డుల కోసం సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ "వార్ 2" బజ్ రోజు రోజుకూ పెరుగుతోంది.;

Update: 2025-07-30 12:12 GMT

ఇండియన్ సినిమా ప్రపంచంలో సరికొత్త రికార్డుల కోసం సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ "వార్ 2" బజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుండగా, బ్రహ్మాస్త్ర చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. భారీ బజ్ తో సినిమాకు సంబంధించి రిలీజ్ అవుతున్న ప్రతి అప్డేట్ ట్రెండింగ్ అవుతోంది. ఇక రొమాంటిక్ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు.

పవర్ ఫుల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఇప్పుడు ఈ బజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది వార్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో. "ఊపిరి ఊయలగా..." అంటూ విడుదలైన ఈ పాట ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాట ట్యూన్ వినగానే యూత్ లోనూ, అభిమానుల్లోనూ కొత్త ఎగ్జయిట్‌మెంట్ కనిపిస్తోంది. సంగీత దర్శకుడు ప్రీతమ్ కాంపోజ్ చేసిన ఈ మెలోడి సాంగ్ యాక్షన్ హంగామా మధ్యలో మంచి రొమాన్స్ ఉండబోతోందని ట్రెండ్ ఎక్కేసింది.

ఇప్పటికే ట్రైలర్ తో పెద్ద ఎత్తున క్యూరియాసిటీ క్రియేట్ చేసిన వార్ 2 టీమ్, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ వేగం పెంచింది. ఈ పాటలో హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్, కియారా గ్లామర్ హైలైట్ కానున్నాయన్న టాక్. ముఖ్యంగా కియారా బికినీ లుక్ కూడా ట్రెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపు విడుదలయ్యే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

మూవీపై హై రెమ్యునరేషన్, భారీ బడ్జెట్ టాక్

ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, కాస్టింగ్ రెమ్యునరేషన్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ రూ.60 కోట్లు, హృతిక్ రూ.48 కోట్లు, కియారా అద్వానీ రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.35 కోట్లు తీసుకున్నట్టు వినిపిస్తోంది. అంటే కేవలం ఈ నలుగురికి రూ.150 కోట్ల పైనే వెచ్చించారు. మొత్తం సినిమాకు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ తెలుగులో కూడా ఎక్కడా తగ్గకుండా మార్కెట్ పెంచుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగ వంశీ, తెలుగు హక్కులు రూ.80 కోట్లకు దక్కించుకున్నారు. బాలీవుడ్ నుంచి ఈ రేంజ్‌లో హక్కులు అమ్ముడయ్యే ట్రెండ్‌ని వార్ 2 మరోసారి ప్రూవ్ చేసింది.

బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్ పక్కా

వార్ 2 విడుదల తేదీ కూడా ఆసక్తికరంగా మారింది. అదే రోజున రజినీకాంత్ 'కూలీ' కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాల మధ్య వార్ ప్రారంభం కానుంది. ఇది కేవలం రెండు సినిమాల పోటీ మాత్రమే కాదు, బాలీవుడ్-సౌత్ ఇండస్ట్రీలు, స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సవాల్. అటు కూలీ పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయితే, ఇటు వార్ 2 మొదటి సింగిల్ ప్రోమో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక ఫైనల్ గా, ఏ సినిమా బాక్సాఫీస్‌ను స్థాయిలో షేక్ చేస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News