చంద్రబాబు, పవన్ లకు థాంక్స్ చెప్పిన తారక్.. దేనికోసం!

అలా తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వార్-2 మూవీకి చంద్రబాబు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడంతో పాటు అదనపు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది.;

Update: 2025-08-13 04:54 GMT

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ విడుదలకు అన్ని పనులు పూర్తయ్యాయి.మరికొద్ది గంటల్లో యూఎస్ లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్ 2 మూవీ అర్ధరాత్రి నుండే కొన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ఏదైనా కొత్త సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమాకి టికెట్ రేట్లు అలాగే అదనపు షోల కోసం చిత్ర యూనిట్ రాష్ట్రం లోని సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే సీఎం,డిప్యూటీ సీఎంల పర్మిషన్ తీసుకోవాల్సిందే. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ రాష్ట్రంలో అదనపు షోలను, అలాగే సినిమాకి టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది.

అలా తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వార్-2 మూవీకి చంద్రబాబు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడంతో పాటు అదనపు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో.. "వార్-2 మూవీకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అలాగే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్-2 మూవీకి కల్పించిన ఈ వెసులుబాటు ఆగస్టు 14 నుండి 23 వరకు అమల్లో ఉంటుంది. వార్-2 మూవీ అదనపు షోలో ఒక్కో టికెట్ కు 500 రూపాయల ధర ఫిక్స్ చేశారు ఏపీ ప్రభుత్వం.

జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు తెలుగులో వార్ 2 మూవీని పంపిణీ చేస్తున్న నిర్మాత నాగవంశీ కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ పెట్టారు.. "వార్-2 మూవీకి టికెట్ రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు అనుమతి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి అనిత గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ ట్వీట్ పెట్టారు.

ఇక ఎన్టీఆర్ నుండి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి లేదా నారా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా ట్వీట్ లేదా పోస్ట్ వస్తే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ కూడా అంతే వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం మినిస్టర్ నారా లోకేష్ వార్ 2 మూవీకి కాకుండా రజినీకాంత్ కూలీ సినిమాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. మరి కనీసం ఇప్పుడైనా వార్ 2 చిత్రంపై ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News