తారక్ ట్విస్ట్ కు తెరపడేది అప్పుడే?
`వార్ 2` తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని దాదాపు అంతా ఓ అంచనాకి వచ్చేసారు;
`వార్ 2` తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని దాదాపు అంతా ఓ అంచనాకి వచ్చేసారు. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో? తారక్ రోల్ పై ఈ క్లారిటీ వస్తోంది. ప్రతి నాయకుడు రోల్ అయినా హీరో హృతిక్ రోషన్ కి ధీటుగా ఆ రోల్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ నమ్మకంతోనే తారక్ విలన్ గా నటిస్తున్నా? అభిమానుల నుంచి ఎలాంటి ఒత్తిడి తెరపైకి రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా తారక్ రోల్ పై మరో కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో హృతిక్ తరహాలోనే తారక్ కూడా ఓస్పై అంటున్నారు. భారత్ వైపు నుంచి దారి తప్పిన కబీర్( హృతిక్ రోషన్) ని ఎదుర్కొనే ధీటైన మరో ఏజెంట్ విక్రమ్ పాత్రలో తారక్ కనిపిస్తాడని ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇప్పటికే తారక్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడని ప్రచారం లో ఉంది.
తాజాగా విక్రమ్ అంటూ తెరపైకి రావడంతో తారక్ రోల్ పై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? హృతిక్ తరహాలో హీరోగా కనిపిస్తాడా? ఆయన్ ముఖర్జీ మరో విలన్ ని ప్లాన్ చేసాడా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ వరకూ ఇలాంటివన్నీ సహజం. వీటిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వరు. అందులోనూ బాలీవుడ్ దర్శకులు అస్సలు రివీల్ చేయరు.
కాబట్టి తారక్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో క్లారిటీ రావాలంటే ఆగస్టు 14 వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం తారక్ -హృతిక్ పై ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ స్టూడియోలో ఈ పాటను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా? ఈ పాట మాత్రం పీక్స్ లో ఉంటుం దనే అంచనాలు బలంగా ఉన్నాయి.