వార్-2.. AI యూజ్ చేశారా?

అదే సమయంలో ఇప్పుడు నెట్టింట ఓ విషయం వైరల్ గా మారింది. తెలుగు వెర్షన్ కోసం మేకర్స్ జాగ్రత్త పడ్డారట.;

Update: 2025-08-06 05:12 GMT

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ వార్-2. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ నటిస్తున్న వార్-2.. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో మన దగ్గర సినీ ప్రియులు, ఆయన అభిమానులు.. మూవీ చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తారక్ కూడా ముంబైలోనే ప్రమోషన్స్ కోసం ఉన్నారని రీసెంట్ గా నిర్మాత నాగవంశీ తెలిపారు. అదే సమయంలో ఇప్పుడు నెట్టింట ఓ విషయం వైరల్ గా మారింది. తెలుగు వెర్షన్ కోసం మేకర్స్ జాగ్రత్త పడ్డారట.

ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్.. తెలుగుతోపాటు హిందీలో డబ్బింగ్ చెప్పినప్పటికీ.. హృతిక్ రోషన్ మాత్రం అలా చేయలేదని సమాచారం. తెలుగులో కంప్లీట్ లిప్ సింక్ కోసం మేకర్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించారని టాక్ వినిపిస్తోంది.

తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా రావడానికి పలువురు రచయితలను కూడా మేకర్స్ బోర్డులోకి తీసుకున్నారని తెలుస్తోంది. తద్వారా మేకర్స్ తెలుగులో కూడా వార్-2తో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మంచి అవుట్ పుట్ కోసమే పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ లో AIని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు!

కాగా సినిమా విషయానికొస్తే.. అశుతోష్ రాణా, అనిల్ కపూర్‌, రుహిగా దిషితా సెహగల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించినట్లు తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇదే అత్యధిక బడ్జెట్ మూవీ అని సమాచారం. మరి చూడాలి వార్-2 ఎలాంటి హిట్ అవుతుందో..

Tags:    

Similar News