2 రోజుల్లో 115 కోట్లు.. హృతిక్, తారక్ స్పెషల్ థ్యాంక్స్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్-2 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-16 10:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్-2 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ సినిమాకు సీక్వెల్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

హృతిక్ రోషన్ రా ఏజెంట్ కబీర్ గా, తారక్ విక్రమ్ గా కనిపించారు. పవర్ ఫుల్ గా నటించి మెప్పించారు. ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన వార్-2.. రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. తొలి రెండు రోజులకు గాను రూ.115 కోట్ల నికర వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ.75 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్ రూ.40 కోట్లు వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆడియన్స్ కు ముగ్గురూ థ్యాంక్స్ చెప్పారు. సినిమా హాళ్లలో మీ అందరి చీర్స్, సెలబ్రేషన్స్ ను చూస్తుంటే తన హృదయం ఉప్పొంగిపోతుందంటూ హృతిక్ రోషన్ రాసుకొచ్చారు.

ఆ తర్వాత వార్-2 మూవీ అందరి లవ్ ను తాను చూస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. తాను కూడా తిరిగి ప్రేమిస్తున్నానని తెలిపారు. తాము చాలా అభిరుచితో నిర్మించిన వార్-2 చిత్రానికి ప్రజల సపోర్ట్ చూస్తుంటే నమ్మశక్యంగా లేదని తెలిపారు. లెట్స్ గో అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఇన్ స్టాగ్రామ్ లో కియారా అద్వానీ.. వార్-2పై ప్రేక్షకుల రెస్పాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ లౌడ్ గా మాట్లాడుతుందని చెప్పారు. మీ చిరునవ్వు, మీ చీర్స్, మీ ఉత్సాహం చూసి మా హృదయాలు ఆనందంతో నిండిపోయాంటూ చెప్పుకొచ్చారు కియారా. ప్రస్తుతం వారి ముగ్గురి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News