ఫోటోటాక్ : వైట్ డ్రెస్‌లో అందాల శిల్పం
హిందీ మూవీ 'జబ్ వి మెట్'లో చిన్న పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన వామికా గబ్బి మెల్ల మెల్లగా హీరోయిన్ స్థాయికి చేరింది.;
హిందీ మూవీ 'జబ్ వి మెట్'లో చిన్న పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన వామికా గబ్బి మెల్ల మెల్లగా హీరోయిన్ స్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు ఇప్పటికీ కష్టాలు ఈదుతున్న అందాల ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తుంది. తెలుగులో ఈమె భలే మంచి రోజు సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తెలుగులో ఆ తర్వాత అవకాశాలు ఎక్కువగా రాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత వామికా కి తెలుగులో ఆఫర్ దక్కింది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న జీ2 సినిమాలో వామిక హీరోయిన్‌గా నటించడం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగు గూఢచారి 2 సినిమాలో వామిక
ఈ గ్యాప్‌లో బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. కెరీర్ ప్రారంభం అయిన ఇన్నాళ్ల తర్వాత వామికా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఈ ఏడాదిలో ఈమె నటిస్తున్న రెండు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మిగిలిన సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఈమె నటిస్తున్న పంజాబీ మూవీ కిక్లీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాతో పాటు హిందీలో దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ షూటింగ్ దశలో ఉంది. తమిళ్‌లో రెండు సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో జీ 2 తో త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
సోషల్ మీడియాలో వామికా ఫోటోలు వైరల్
సోషల్ మీడియాలో ఎప్పటిలాగే తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి వైట్ డ్రెస్‌లో మెరిసి పోతూ అందాల శిల్పం అన్నట్లుగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో ఎలాంటి ఔట్ ఫిట్‌లో అయినా చూపు తిప్ప నివ్వని అందం ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. అందుకే క్లీ వేజ్ షో చేస్తూ వైట్ డ్రెస్‌లో కన్నుల విందు చేస్తున్న ముద్దుగుమ్మ వామికా గబ్బి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగానే వామికా అందంగా ఉంటుంది, అలాంటి వామికా ఇలా అందాల ఆరబోత చేస్తూ వైట్ డ్రెస్‌లో కనిపిస్తే అందాల శిల్పం అన్నట్లుగా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఫోటోలను తెగ లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు.
సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్‌లోనూ..!
వామికా సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. హిందీ, పంజాబీ సిరీస్‌ల్లో నటించడం ద్వారా అక్కడ గుర్తింపు దక్కించుకుంది. 2007లో ఇండస్ట్రీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె 2013 నుంచి హీరోయిన్‌గా నటించడం ప్రారంభం అయింది. మలయాళ చిత్రం గోదాలో కూడా ఈమె నటించింది. హిందీతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటించిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో వామికా గబ్బి ఒకరు అనడంలో సందేహం లేదు. పలు అవార్డ్‌లను, రికార్డ్‌లను సొంతం చేసుకున్న వామికా ఈ మధ్య కాలంలో సినిమాలతో చాలా బిజీ అయింది. ముందు ముందు తెలుగులో ఆమె నుంచి మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.