వాల్ పోస్టర్ లో తర్వాత అంతా స్టార్ హీరోలేనా?
మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా నిర్మాణంతో వాల్ పోస్టర్ సంస్థ స్టార్ లీగ్ లోకి అడుగు పెడుతోన్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా నిర్మాణంతో వాల్ పోస్టర్ సంస్థ స్టార్ లీగ్ లోకి అడుగు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ పరిమిత బడ్జెట్ లో కాన్పెప్ట్ బేస్ట్ చిత్రాలను సదరు సంస్థ నిర్మిం చుకుంటూ వచ్చింది. నిర్మించిన ఐదు సినిమాలు మంచి ఫలితాలు సాధించాయి. `హిట్ ది థర్డ్ కేస్` తో డబుల్ హ్యాట్రిక్ కూడా నమోదవుతుందని అంచనాలున్నాయి. దీంతో ఏడవ సినిమాని చిరంజీవితో నిర్మిస్తున్నారు.
ఎస్ ఎల్ వీసీ బ్యానర్ భాగస్వామ్యంలో నిర్మాణం జరుగుతున్న చిత్రమిది. ఈ చిత్రానికి `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నాడు. రెండు సంస్థలు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నాయి. ఆ రకంగా నాని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ మార్క్ భారీ యాక్షన్ థ్రిల్లర్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. చిరంజీవిలో పాత ఖైదీని తెరపై ఆవిష్కరిస్తున్నారే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది. వాల్ పోస్టర్ అనుబంధంగా మరో నిర్మాణ సంస్థను స్థాపించాలని నాని ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి సినిమా తర్వాత వాల్ పోస్టర్లో కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడు. ఈనేపథ్యంలో అనుబంధంగా మరో నిర్మాణ సంస్థను స్థాపించి అందులో తన మార్క్ కాన్సెప్ట్ బేస్ట్ చిత్రాలు..కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయాలని ఆలోచన చేస్తున్నారుట.
అయితే ఈ ప్లాన్ ఇంకా నాని మైండ్లో ఆలోచన దశలోనే ఉందిట. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని లీకులందుతున్నాయి. ఇప్పటికే అల్లు అరవింద్ సహా పలువురు నిర్మాతలు ఇదే తరహాలో చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. కొత్త నిర్మాణ సంస్థ ఏర్పాటుతో అదనంగా కొన్నిరకాల సౌలభ్యాలు కలుగు తుంటాయి.