పెద్ది కాదు విశ్వంభర ఉందని మర్చిపోయారా..?
మెగా హీరోల సినిమాలకు మెగా ఫ్యాన్స్ చేసే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. మెగా సినిమా ఏదైనా వస్తుంది అంటే చాలు వాళ్లు చేసే హంగామా హైప్ ఎక్కిస్తుంది.;
మెగా హీరోల సినిమాలకు మెగా ఫ్యాన్స్ చేసే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. మెగా సినిమా ఏదైనా వస్తుంది అంటే చాలు వాళ్లు చేసే హంగామా హైప్ ఎక్కిస్తుంది. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ఓ పక్క గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. విశ్వంభర సినిమా పూర్తై గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. ఐతే విశ్వంభర డైరెక్టర్ వశిష్ట వరుస ఇంటర్వ్యూస్ లో సినిమా గురించి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. కానీ అవేవి ఆశించిన రేంజ్ లో బజ్ క్రియేట్ చేయట్లేదు.
పెద్ది మీద మెగా ఫ్యాన్స్ ఫోకస్..
మెగా ఫ్యాన్స్ అంతా కూడా తమ ఫోకస్ అంతా కూడా పెద్ది మీద ఉంచారు. మధ్యలో విశ్వంభర సినిమా ఒకటి ఉందని మర్చిపోయినట్టు ఉన్నారు. విశ్వంభర సినిమాను వశిష్ట చాలా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే సినిమా గురించి ఈ సైలెన్స్ అంతా మంచిదే అంటున్నారు. ఎందుకంటే సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సర్ ప్రైజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. అలా కాకుండా సినిమాపై భారీ హైప్ వచ్చి ఆ అంచనాలను అందుకోకపోతే దెబ్బ పడుతుంది.
మెగా ఫ్యాన్స్ ఐతే మాట్లాడితే పెద్ది, ఓజీ అంటారే తప్ప చిరంజీవి విశ్వంభర గురించి సోషల్ మీడియాలో ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఇంత లో ప్రొఫైల్ లో చిరు సినిమా ఉండటం చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా విజువల్ ట్రీట్ ఇస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాపై ఫ్యాన్స్ గురి కుదరాలంటే మరో ప్రమోషనల్ వీడియో వదలాలి.
త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..
విశ్వంభర షూటింగ్ మొదలైనప్పుడు ఒక గ్లింప్స్ వదిలారు. ఆ నెక్స్ట్ ఒక సాంగ్ వచ్చింది. ఫస్ట్ గ్లింప్స్ ఓకే కానీ సాంగ్ రీచ్ అవ్వలేదు. ఐతే త్వరలో సినిమా నుంచి మరో టీజర్ రాబోతుందట. అది వచ్చిన తర్వాత విశ్వంభర మీద అంచనాలు పెరుగుతాయని అంటున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కూడా ఉన్నారు. విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది కూడా క్లారిటీ లేదు. సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు కానీ అది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. సో మెగా ఫ్యాన్స్ నిరాశకు అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు.