• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్ అసలు పేరు ఇది...

విశ్వక్ అసలు పేరు ఇది కాదంట!

| ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిలో కొందరు నటులు మాత్రమే స్పెషల్ ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-18 00:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరిలో కొందరు నటులు మాత్రమే స్పెషల్ ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన విభిన్నమైన సినిమాలతో సందడి చేస్తున్నారు. గతేడాది దాస్ కా ధమ్కీ తో హిట్‌ను అందుకున్నారు.

ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే మొదలుపెట్టిన గామి సినిమాను రేసులోకి తీసుకువచ్చారు విశ్వక్. మార్చి 8న తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ మూవీతో పాటు ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో సోలోగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విశ్వక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు విశ్వక్. "నా అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి వచ్చాక నాకేం కలిసి రావట్లేదు. అప్పటికే హీరోగా నటించిన వెళ్ళిపోమాకే సినిమా తెరకెక్కి ఏడాదిపైనే అయ్యింది. కానీ రిలీజ్ అవ్వట్లేదు. ఆడిషన్స్ ఇస్తున్నా ఏ మూవీ కి కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. ఆ సమయంలో మా నాన్న నా పేరు దినేష్ నాయుడు నుంచి విశ్వక్ సేన్ అని మార్చారు" అని చెప్పారు.

పేరు మార్చుకున్న రెండు వారాలకే ఆ ఎఫెక్ట్ కనపడిందని తెలిపారు విశ్వక్ సేన్. "అప్పటి వరకు కూడా ఆగిపోయి ఉన్న వెళ్ళిపోమాకే సినిమా రిలీజ్ అయింది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఫలక్ నామా దాస్ ప్రీ ప్రొడక్షన్ కూడా అదే టైంలో మొదలుపెట్టాం. అయితే జాతకాలు, ఆస్ట్రాలజీని నేను నమ్మను. కానీ వాటికి రెస్పెక్ట్ మాత్రం తప్పకుండా ఇస్తాను" అని తెలిపారు.

త్వరలో విడుదల కానున్న విశ్వక్‍సేన్ గామి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు నాలుగేళ్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. విద్యాధర్ కటిగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఘోరగా డిఫరెంట్ గెటప్‍ లో విశ్వక్ నటించారు. ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరి 29న రానుంది. ఈ గామి సినిమా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి విశ్వక్ ఈ సినిమా ద్వారా జోష్ చూపిస్తారో లేదో చూడాలి.

Tags:    
  • Viswaksen 
  • Dineshnaidu 
  • Tollywood 
  • Gaami 
  • Gangsofgodavari 
  • Filmindsutry 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS