హనుమాన్ జయంతికి మెగా గిఫ్ట్.. కలర్ఫుల్ ప్రోమో!

ఈ పాట ప్రోమోలో ఎక్కువగా రివీల్ చేయకున్నప్పటికి మ్యూజిక్ బీట్ పాజిటివ్ వైబ్స్ క్రియేయ్ చేస్తున్నాయి.;

Update: 2025-04-11 07:18 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విష్వంభర ప్రమోషన్ జోరు మొదలైంది. హనుమాన్ జయంతి సందర్భంగా సినిమా నుంచి ‘రామరామా’ అనే ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. మ్యూజికల్ లెజెండ్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ పాటపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు హై లోనే ఉన్నాయి. ఇక పూర్తి పాట ఏప్రిల్ 12 ఉదయం 11:12కి విడుదల కానుంది.

ఈ పాట ప్రోమోలో ఎక్కువగా రివీల్ చేయకున్నప్పటికి మ్యూజిక్ బీట్ పాజిటివ్ వైబ్స్ క్రియేయ్ చేస్తున్నాయి. ఈ పాట రామ భక్తి పరమ పవిత్రతను గుర్తుచేస్తూ, హనుమంతుడి వీరాన్ని ప్రతిబింబిస్తూ సాగుతుందట. ఈ పాటను శంకర్ మహాదేవన్ పాడగా, శోభి మాస్టర్ లలిత మాస్టర్ దీనికి నృత్య దర్శకత్వం వహించారు. పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు.

ప్రోమోలో చిరంజీవి చిన్నారులతో కలిసి హనుమంతుడు గెటప్‌లో ఉన్న కిడ్స్ మధ్య కనిపించడమే హైలైట్. ఒక్కసారిగా 1980-90ల ‘చిరు’ పవర్‌ని గుర్తు చేసేలా చిరంజీవి ఎనర్జీ ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ పాటను భక్తిగీతంగా వినొచ్చు, యాక్షన్ సీన్‌గా అనిపించొచ్చు, లేదా ఒక సంస్కృతిక కార్యక్రమంలా ఎంజాయ్ చేయొచ్చు.. ఎలా అర్థం తీసుకున్నా, ఫీలింగ్ మాత్రం శక్తివంతంగా ఉంటుందని అనిపిస్తోంది.

దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాలో విజువల్ ఫాంటసీకి కొత్త నిర్వచనం తీసుకురానున్నట్టు ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ‘బింబిసార’ సినిమాతో అతను చూపిన విభిన్న ప్రపంచం, ఇప్పుడు విష్వంభర ద్వారా మరింత విశాలమైన మైథలాజికల్ యూనివర్స్‌గా మారుతోంది. మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్ చూస్తే, ఇది చిరంజీవి కెరీర్‌లో మోస్ట్ ఎంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 12న విడుదల కానున్న పూర్తి పాట రామ నామంతో థియేటర్లలో రణరంగం సృష్టించనుందని భావిస్తున్నారు.

ఈ పాటతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే ‘రామరామా’ పాట ప్రోమోను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇక పూర్తి పాట విడుదల అనంతరం మిగతా పాటలపై కూడా ఆసక్తి పెరిగేలా ఉంది. మొత్తంగా విష్వంభర ఇక సంగీత ప్రయాణంలోకి అడుగుపెట్టింది. మరి కీరవాణి ఈసారి ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Full View
Tags:    

Similar News