విశ్వక్సేన్ డైరెక్షన్.. తరుణ్ భాస్కర్ డైలాగ్స్
ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించాడు విశ్వక్. ధారలై పారుతున్న రక్తం మీద గొడ్డలి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ వయొలెంట్ లుక్‌లో కనిపించాడు విశ్వక్.;
ఇటీవలే ‘ఫంకీ’తో పెద్ద షాక్ తిన్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. అంతకుముందు తన మూడు చిత్రాలు లైలా, మెకానిక్ రాకీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ‘ఫంకీ’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అదీ షాకిచ్చింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘కల్ట్’ మీదే ఉంది. ‘ఫంకీ’ రిలీజై వారం కూడా కాకముందే ఈ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు విశ్వక్. ఈ శనివారం ‘కల్ట్’ టీజర్ లాంచ్ కాబోతోంది.
ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించాడు విశ్వక్. ధారలై పారుతున్న రక్తం మీద గొడ్డలి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ వయొలెంట్ లుక్‌లో కనిపించాడు విశ్వక్. ఇది తన కెరీర్లోనే అత్యంత వయొలెంట్ సినిమా అని.. మలయాళం ‘మార్కో’ స్టయిల్లో ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా విశ్వకే సమకూర్చాడు.
ఇంకో విశేషం ఏంటంటే.. ‘కల్ట్’ మూవీకి డైలాగ్స్ రాసింది దర్శకుడు తరుణ్ భాస్కర్. విశ్వక్‌కు ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి కల్ట్ మూవీని ఇచ్చింది తరుణే. అలాంటిది ఇప్పుడు విశ్వక్ ‘కల్ట్’ పేరుతో తీస్తున్న సినిమాకు తరుణ్ డైలాగ్స్ రావడం విశేషం. మరోవైపు వీరి కలయికలో ‘ఈ నగరానికి ఏమైంది-2’ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఫస్ట్ రిలీజ్ టైంలో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
దీంతో సీక్వెల్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. అది విశ్వక్ కెరీర్లో అతి పెద్ద హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. ఐతే అంతకంటే ముందే ‘కల్ట్’ మూవీతో పలకరించబోతున్నాడు విశ్వక్. సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా గాయత్రి భరద్వాజ్ నటించింది. ఈ చిత్రంతో 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేయబోతున్నాడట ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్.