విశ్వక్ కు గీతా ఆర్ట్స్ ఆఫర్.. అల్లు అరవింద్ క్లారిటీ!

విశ్వక్ కు, తనకు మధ్య గత ఐదారేళ్లుగా సినిమా చేయాలనే చర్చ నడుస్తోందని అల్లు అరవింద్ వెల్లడించారు.

Update: 2026-06-11 10:59 GMT

దీవానా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్, అల్లు అరవింద్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం కోసం విశ్వక్ సేన్ నేరుగా అల్లు అరవింద్ ను అడగడం ఈవెంట్ కు హైలైట్ గా నిలిచింది. దీనిపై అల్లు అరవింద్ కూడా అంతే స్పోర్టివ్ గా రియాక్ట్ అయ్యి, ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

విశ్వక్ కు, తనకు మధ్య గత ఐదారేళ్లుగా సినిమా చేయాలనే చర్చ నడుస్తోందని అల్లు అరవింద్ వెల్లడించారు.

విశ్వక్ ఒకసారి అడుగుతాడు, ఆ తర్వాత మర్చిపోతాడు, అలాగే నేను కూడా అడుగుతాను, తర్వాత మర్చిపోతాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఒకసారి కలుసుకున్నప్పుడు మాత్రమే సినిమా గురించి మాట్లాడుకుంటామని, కానీ ఇప్పటి వరకు అది మెటీరియలైజ్ కాలేదని ఆయన అన్నారు. విశ్వక్ రెమ్యునరేషన్ గురించి కూడా అల్లు అరవింద్ ఫన్నీ కామెంట్స్ చేశారు.

"ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తారా అంతేనా?" అని విశ్వక్ అడగగా, "నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే, ఇస్తా" అని అల్లు అరవింద్ కౌంటర్ వేశారు. ఈ సరదా సంభాషణ ఈవెంట్ లో ఉన్న వాళ్లందరినీ కడుపుబ్బా నవ్వించింది. విశ్వక్ తో సినిమా చేయాలని తనకెప్పుడూ ఉంటుందని, కానీ టైమ్ రావడం లేదని అల్లు అరవింద్ అన్నారు. అయితే త్వరలోనే ఆ టైమ్ వస్తుందని, కచ్చితంగా విశ్వక్ తో సినిమా చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

అంతే కాకుండా "ఆలస్యం అమృతం" అని బదులిస్తూ, మంచి ప్రాజెక్ట్ తో వస్తామని సూచించారు. ఇలా దీవానా ఈవెంట్ వేదికగా విశ్వక్, అల్లు అరవింద్ ల మధ్య జరిగిన ఈ సంభాషణ, గీతా ఆర్ట్స్ లో విశ్వక్ మూవీ త్వరలోనే ఉండబోతోందన్న క్లారిటీని ఇచ్చింది. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చాలా రోజులుగా అల్లు అరవింద్ పెద్ద బడ్జెట్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. చిన్న సీనుమాలు మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా GA2 లో ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు విశ్వక్ సేన్ లాంటి టాలెంటెడ్ హీరోలతో కూడా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి వస్తుందో లేదో చూడాలి.



Tags:    

Similar News