• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ గెలుపుని రూ.2 కోట్ల...

పవన్ గెలుపుని రూ.2 కోట్ల ఖర్చుతో ఎంజాయ్‌ చేశారట!

| అదే ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ తో తనకు ఉన్న అనుబంధం గురించి విశ్వ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-11-14 12:30 GMT

పవన్‌ కళ్యాణ్‌ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కొంత మంది ఇబ్బందిగా ఫీల్ అయినా, ఎక్కువ శాతం మంది సంతోషంగా ఉన్నారు. పవన్‌ కి భారీ విజయం దక్కడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం పట్ల ఎంతో మంది హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా పవన్‌ వద్దకు వెళ్లి అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ మాత్రం పవన్‌ గెలవడంతో ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేసి పార్టీ ఏర్పాటు చేసి ఎంజాయ్‌ చేయడం జరిగిందట.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో అత్యధిక సినిమలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వ్యాపారవేత్త అయిన విశ్వ ప్రసాద్‌ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశ్యంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన బ్యానర్‌లో పలు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని మాత్రం నిరాశ పరిచాయి. ముఖ్యంగా రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్‌ తీవ్రంగా నిరాశ పరచడంతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో చాలా పెద్ద తప్పు ఆ సినిమాను చేయడం అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యం అన్నారు.

అదే ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ తో తనకు ఉన్న అనుబంధం గురించి విశ్వ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. తాను సినిమా ఇండస్ట్రీకి రాకముందు అంటే నిర్మాణం చేయడానికి ముందు నుంచే పవన్‌ కళ్యాణ్‌ గురించి తెలుసు. ఆయనతో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్‌ చేశాం. కానీ ఎక్కువగా వీలు పడలేదు. నిర్మాతగా ఎప్పుడూ ఆయన్ను కలవలేదు. కానీ ఆయనతో ఉన్న సన్నిహిత్యం వల్ల ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆనందంతో సన్నిహితులతో పార్టీ చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ పార్టీకి రెండు కోట్ల ఖర్చు అయిందట కదా అంటూ ప్రశ్నించగా విశ్వ ప్రసాద్‌ నవ్వి ఔను నిజమే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాలను నిర్మించాలని భావించిన విశ్వ ప్రసాద్‌ కి అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో అయినా పవన్‌ కళ్యాణ్ తో ఈయన సినిమాలు నిర్మిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పరిపాలనతో బిజీగా ఉంటున్న కారణంగా షూటింగ్‌ కి ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోతున్న పవన్‌ కళ్యాణ్ త్వరలోనే ఓజీని పూర్తి చేస్తానంటూ నిర్మాతకు హామీ ఇచ్చాడట. వచ్చే ఏడాదిలోనే ఓజీ మరియు హరి హర వీరమల్లు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    
  • Pawankalyan 
  • Janasena 
  • Andhrapradesh 
  • Politics 
  • OGMovie 
  • Hariharaveeramallu 
  • Bromovie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS