యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్.. స్టార్స్ కి ఇస్తున్న సలహా..!

ఐతే రాక్షసుడు తెలుగులో హిట్ అవ్వడంతో విష్ణు విశాల్ ఇక మీదట తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.;

Update: 2025-11-05 07:30 GMT

కోలీవుడ్ లో విష్ణు విశాల్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. అలా ఉండేలా తనే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ముందు తన టాలెంట్ తో అందరినీ మెప్పించిన విష్ణు విశాల్ ఈమధ్య సొంత ప్రొడక్షన్ పెట్టి తను లీడ్ రోల్ లో సినిమాలు చేస్తున్నాడు. అవి కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అవుతున్నాయి. ఐతే విష్ణు విశాల్ చేసిన రాచ్చసన్ సినిమా తెలుగులో రాక్షసుడుగా బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేశాడు. ఐతే రాక్షసుడు తెలుగులో హిట్ అవ్వడంతో విష్ణు విశాల్ ఇక మీదట తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

సైకో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో విష్ణు విశాల్ ఆర్యన్..

లేటెస్ట్ గా విష్ణు విశాల్ హీరోగా ఆర్యన్ సినిమా వచ్చింది. తమిళ్ లో ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా అక్కడ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సైకో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆర్యన్ సినిమాను తెలుగులో నవంబర్ 7న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా విషయంలో విష్ణు విశాల్ చాలా నమ్మకంగా ఉన్నాడు. తెలుగు ఆడియన్స్ కి థ్రిల్లర్ సినిమాలు బాగా నచ్చుతాయి.

సైకో థ్రిల్లర్ సినిమాలను కూడా ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాక్షసుడు సినిమా ఒరిజినల్ హీరో విష్ణు విశాల్ కాబట్టి ఆర్యన్ సినిమాను కూడా అదే తరహాలో అఫ్కోర్స్ కథ వేరైనా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం పక్కా అని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా తమిళ్ లో రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఆ సక్సెస్ మీట్ లో హీరోలకు ఒక సలహా ఇచ్చాడు. వాళ్లు రెమ్యునరేషన్ తగ్గిస్తే ప్రొడక్షన్ కి ఇంకాస్త సపోర్ట్ అవుతుందని చెప్పాడు విష్ణు విశాల్.

స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్.. సగానికి పైగా స్టార్ రెమ్యునరేషన్స్..

ఈమధ్య స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ లో సగానికి పైగా స్టార్ రెమ్యునరేషన్స్ అవుతున్నాయి. అందుకే హీరోగా కాదు విష్ణు విశాల్ ఇప్పుడు నిర్మాతగా మారి స్టార్స్ ని పారితోషికం తగ్గించుకుని నిర్మాతకు సపోర్ట్ గా ఉండమని అంటున్నాడు. తమిళ్ లో కూడా స్టార్ రెమ్యునరేషన్ వల్ల కొన్ని సినిమాలు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఐతే విష్ణు విశాల్ ఒక్క కామెంట్ చేస్తే హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గిస్తారని చెప్పలేం కానీ విష్ణు విశాల్ నిర్మాతగా మారాక అవతల సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నాడని అర్థమవుతుంది.

విష్ణు విశాల్ ఆర్యన్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే ఈ సినిమాతో పాటు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐతే ఆ రెండు సినిమాలకు ఆర్యన్ కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కాబట్టి విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకుల మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Tags:    

Similar News