విష్ణు విశాల్ ఆర్యన్ టీజర్.. థ్రిల్ ఇచ్చేలా ఉందే!

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ గురించి అందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ తో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.;

Update: 2025-09-30 16:14 GMT

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ గురించి అందరికీ తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ తో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే పలు గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ తో మెప్పించిన విష్ణు విశాల్.. ఇటీవల రాట్చసన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతగా కూడా హీరోనే వ్యవహరిస్తున్నారు. సొంత బ్యానర్ విష్ణు విశాల్ స్టూడియోస్ పై రూపొందిస్తున్నారు.

అక్టోబర్ 31వ తేదీన తమిళం, తెలుగులో మూవీ రిలీజ్ కానుండగా.. నేడు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా టీజర్ ను మంగళవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టీజర్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తికరంగా ఉండి.. ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

టీజర్ ద్వారా ఒక థ్రిల్లింగ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ తో పాటు సినిమాలో విష్ణు విశాల్ రోల్ ను పరిచయం చేశారు మేకర్స్. ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్ లో తీసుకెళ్లారు. విష్ణు విశాల్ మిస్టీరియస్ కిల్లర్ గుర్తింపును దర్యాప్తు చేయడం ప్రారంభించి ప్రయాణంలో ఆసక్తికరమైన వివరాలు టీజర్ లో వెల్లడిస్తూ కనిపిస్తారు.

విష్ణు విశాల్ లుక్ చాలా రిఫ్రెషింగ్‌ గా ఉంది. పూర్తిగా పాత్రలో ఒదిగిపోయారు. కెరీర్ లో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయనున్నారు. 34 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న ఆయన.. బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించినట్లు అనిపిస్తుంది. రోల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఆయన చెప్పిన డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సినిమాను రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్.. సినిమా కథకు సరిగ్గా సరిపోయే ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్పాలి. ఓవరాల్ గా టీజర్.. ఆర్యన్ సినిమా పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ అని చెబుతోంది.

Full View
Tags:    

Similar News