విశాల్ అంటేనే వివాదాలు.. ఎందుకలా..?
ముఖ్యంగా అతనితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, ఫైనాన్షియర్స్ తో విశాల్ వ్యవహరిస్తున్న తీరు అతని గ్రాఫ్ పడిపోయేలా చేస్తుంది.;
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన విశాల్ ఇప్పుడు పూర్తిగా కెరీర్ లో వెనకబడటమే కాకుండా ఉన్న కాస్త కూస్త ఇమేజ్ ని కూడా వరుస వివాదాలతో చెడగొట్టుకుంటున్నాడు. ఈమధ్య తరచు వివాదాల్లో ఉంటున్నాడు విశాల్. ముఖ్యంగా అతనితో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, ఫైనాన్షియర్స్ తో విశాల్ వ్యవహరిస్తున్న తీరు అతని గ్రాఫ్ పడిపోయేలా చేస్తుంది. చాలా వరకు వివాదాలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాకా వెళ్లగా ఒక వివాదం అయితే ఏకంగా కోర్ట్ కేసు దాకా వెళ్లింది.
లైకాకు ఇవ్వాల్సిన డబ్బు విశాల్ తిరిగి ఇవ్వకుండా..
ఒక ఫైనాన్షియర్ దగ్గర విశాల్ తీసుకున్న 21 కోట్ల రూపాయలు లైకా సంస్థ క్లియర్ చేయగా.. అందుకు విశాల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అడిగారట. అందుకు అప్పుడు విశాల్ సరే అని చెప్పి ఆ తర్వాత సైలెంట్ గా లైకాకు తెలియకుండానే సినిమా రైట్స్ అమ్మేశాడట. అంతేకాదు లైకాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదట. ఐతే లైకా సంస్థ విశాల్ కు మాటలతో కాకుండా చేతల్లో చూపించాలని లీగల్ గా ప్రొసీడ్ అయ్యింది.
మద్రాస్ హైకోర్టులో విశాల్ మీద కేసు వేసింది లైకా ప్రొడక్షన్. ఐతే రీసెంట్ గా హైకోర్ట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. లైకా సంస్థకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు.. 21 కోట్ల రూపాయలు 30 శాతం వడ్డీ కలిపి విశాల్ లైకా సంస్థకు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఐతే విశాల్ ఈ తీర్పుపై కూడా మరోసారి అప్పీల్ కు వెళ్లాడు. విశాల్ తరపున లాయర్ కోర్టుని కోరగా అతని మీద సీరియస్ అయ్యింది హైకోర్టు. విశాల్ ధనవంతుడు కాకపోతే దివాళా తీసినట్టు ప్రకటిస్తారా అంటూ షాక్ ఇచ్చింది.
హీరోగా, నిర్మాతగా విశాల్ ఎంతో మంచి పాపులారిటీ..
విశాల్ 10 కోట్లను డిపాజిట్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హీరోగా, నిర్మాతగా విశాల్ ఎంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఐతే ఈమధ్య సినిమాలు కూడా పెద్దగా చేయని విశాల్ ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ కేసు విషయంలో మాత్రం హైకోర్టు నుంచి షాక్ తిన్నాడు. ఒకవేళ విశాల్ సైడ్ ఏదైనా వాస్తవం ఉంటే అది కోర్టుకి సమర్పించాల్సిన అవసరం ఉంది.
ఫైనాన్షియల్ ఇష్యూస్ లో విశాల్ ఇలా ప్రతిసారి నిర్మాతలు, ఫైనాన్షియర్స్ తో వివాదాలు పెట్టుకోవడం అతని కెరీర్ కు ఏమాత్రం మంచిది కాదు. అసలే కెరీర్ లో చాలా వెనకబడిన విశాల్ తనతో సినిమా తీయాలంటే ఆలోచించే పరిస్థితికి వచ్చాడు. కెరీర్ సక్సెస్ లో లేదు.. ఇప్పుడు ఈ వివాదాలు కూడా విశాల్ ని మరింత వీక్ చేస్తున్నాయి. ఐతే ఈ కేసు విషయంపై విశాల్ ఏదైనా క్లారిటీ ఇస్తారా.. దీనిపై విశాల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూడాలి.