విరుష్క 'పర్ఫెక్ట్ ఫిట్' కపుల్ గోల్స్
ఈ జంటను చూడగానే పర్ఫెక్ట్ ఫిట్ కపుల్ అని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఫిట్ నెస్ గోల్స్ విషయంలో విరుష్క (విరాట్-అనుష్క) అందరికీ పెద్ద స్ఫూర్తి.;
ఈ జంటను చూడగానే పర్ఫెక్ట్ ఫిట్ కపుల్ అని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఫిట్ నెస్ గోల్స్ విషయంలో విరుష్క (విరాట్-అనుష్క) అందరికీ పెద్ద స్ఫూర్తి. ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. వారసులు వామిక- అకాయ్ వేగంగా ఎదిగేస్తున్నారు. అయినా ఇప్పటికీ టీన్ వైబ్స్ తో ఈ జంట అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటికీ స్థిరమైన, నమ్మకమైన ఆట తీరును కనబరచడానికి కారణం అతడి ఫిట్‌నెస్, కఠోర సాధన అనడంలో ఎలాంటి సందేహం లేదు. తినే ఆహారం, సమయానికి వ్యాయామం, ఆటలో ప్రాక్టీస్ వంటివి వయసును కూడా దాచేస్తాయి. వయసుతో పాటే వచ్చే అనారోగ్యాలు దూరమవుతాయి. ఆరోగ్యం, ఫిట్ లుక్ విషయంలో విరాట్, అనుష్క శర్మ దంపతులు ఎంతో నిబద్ధతతో హార్డ్ వర్క్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటుంది.
ఎవరికైనా అందుబాటులో ఉండేది రోజుకు 24 గంటలే. అందులో కనీసం గంట సమయం ఫిట్ నెస్ కోసం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఆ సమయాన్ని కూడా లేజీగా గడిపేయడం నేటితరం తప్పిదం. అలాంటి వారందరికీ విరుష్క దంపతులు సరైన ఇన్ స్పిరేషన్. క్రీడాకారుడిగా కోహ్లీ, ఎంటర్ ప్రెన్యూర్ కం బిజినెస్ ఉమెన్ గా అనుష్క శర్మ నిరంతరం బిజీ షెడ్యూళ్లతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయినా కానీ ఈ జోడీ ఫిట్ నెస్ కోసం సమయం ఎలా కేటాయించగలదు? అన్నది ఇతరులను ఆలోచింపజేస్తోంది.
తాజాగా విరుష్క దంపతులు రిగరస్ వ్యాయామానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట ఫోటోలతో పాటు, ఇన్ స్టా క్యాప్షన్ ఇలా ఉంది.``గర్వంతో భుజాలపై భారత టెస్ట్ జెర్సీని ధరించి, విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కి చేరువగా నిలబడి ఉన్నాడు. అవిశ్రాంత అంకితభావం, అభిరుచి, నాయకత్వానికి చిహ్నంగా ఈ ఫోటోషూట్ భారతదేశపు గొప్ప టెస్ట్ కెప్టెన్లలో ఒకరైన కోహ్లీ లెగసీని ఆవిష్కరిస్తుంది. అతడిలోని అచంచల ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి కారకుడి ఆవిష్కరణ`` అని అందమైన వ్యాఖ్యానాన్ని రాసారు.