టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు.. ఇదేదో బాగుందిగా..!
ఈ క్రమంలో లేటెస్ట్ గా వర్జిన్ బాయ్స్ సినిమా చూస్తే వారిలో కొందరికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు నిర్మాత రాజా దారపునేని.;
స్టార్ సినిమాలనే ప్రేక్షకులను పట్టించుకోని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే థియేటర్లు కళకళలాడుతుండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. స్టార్ సినిమాలు అది కూడా సూపర్ హిట్ సినిమాలకు కాస్త థియేటర్ల సందడి కనిపిస్తుంది తప్ప.. ఫ్లాపైతే ఈవెనింగ్ ఆట కల్లా థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఈ టైం లో కొత్త వాళ్లతో సినిమా అంటే అది చాలా కష్టంగా మారింది.
అయినా కూడా తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతో ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి లాగా తమ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ కి వచ్చే చూసేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఐతే ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో పంథా ఉంటుంది.
ఈ క్రమంలో లేటెస్ట్ గా వర్జిన్ బాయ్స్ సినిమా చూస్తే వారిలో కొందరికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు నిర్మాత రాజా దారపునేని. రాజ్ గురు బ్యానర్ పై తను నిర్మించిన వర్జిన్ బాయ్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాను జూలై 11న టికెట్ పెట్టి కొన్న వారిలోంచి 11 మందిని సెలెక్ట్ చేసి వారికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ఈవెంట్లో ప్రకటించారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కూడా కొన్ని థియేటర్లలో డబ్బు మీమీద వర్షంలా పడుతుందని అది మీ సొంతమవుతుంది అని చెప్పారు చిత్ర యూనిట్.
ఇదంతా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే మార్గంలోని ప్రయత్నాలే అని చెప్పొచ్చు. ఏది ఏమైనా టికెట్ కొట్టు.. గిఫ్ట్ పట్టు కాన్సెప్ట్ క్లిక్ అయితే మాత్రం నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మేకర్స్ ఆడియన్స్ కు ఇలాంటి పే బ్యాక్ ఆఫర్స్ ని ఇచ్చేందుకు రెడీ అవుతారని చెప్పొచ్చు.
థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ సంఖ్య తగ్గుతున్న ఈ టైం లో తమ సినిమాను ప్రేక్షకులు చూసేలా చేయాలని దానికి కొంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వర్జింగ్ బాయ్స్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.