భార్య పై విరాట్ కోహ్లీ మనసులోని ఐదు మాటలు!

అత్యంత ఆకర్షణీయమైన - ఆదర్శవంతమైన జంటలలో విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ జోడీ ఎప్పుడూ ముందుంటారు ఇద్ద‌రి మధ్య ఉన్న బంధం.. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Update: 2026-06-08 06:01 GMT

అత్యంత ఆకర్షణీయమైన - ఆదర్శవంతమైన జంటలలో విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ జోడీ ఎప్పుడూ ముందుంటారు ఇద్ద‌రి మధ్య ఉన్న బంధం.. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మైదానంలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ నిజ జీవితంలో ఒక భర్తగా భార్య అనుష్కను ఎంతగానో గౌర‌విస్తారు. విభిన్న సం దర్భాలలో అనుష్క గురించి విరాట్ పంచుకున్న ఐదు అద్భుతమైన విషయాలు తెలిస్తే? ప్రతి అమ్మాయి తన భాగస్వామి నుండి వినాలని కోరుకునేలా ఈ ఐదు క‌నిపిస్తాయి. మొదటిగా తన జీవితంలో - ఆలోచనా విధానంలో వచ్చిన సానుకూల మార్పులకు అనుష్కనే ప్రధాన కారణమని విరాట్ ఎప్పుడూ చెబుతుంటారు. అనుష్క తన జీవితంలోకి రాకముందు తాను చాలా దూకుడుగా.. ఒక రకమైన సంకుచిత ఆలోచనలతో ఉండేవాడినన్నారు.

అనుష్క‌ పరిచయంతోనే తనలో పరిణతి వచ్చిందని.. జీవితాన్ని వేరొక కోణంలో చూడటం నేర్చుకున్నానని తెలిపారు. ఒక వ్యక్తిగా తనను తాను మెరుగుపరుచుకోవడంలో అనుష్క చూపిన ప్రభావం అమూల్యమైనదని విరాట్ కొనియాడారు. రెండవది.. అనుష్కలోని నిజాయితీ ..ముక్కుసూటితనం తనను ఎంతగానో ఆకర్షించాయన్నారు.సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి అయినా? అనుష్క ఎప్పుడూ ఎలాంటి నటన లేకుండా.. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందన్నారు. అనుష్క నిజాయితీతో పంచుకునే అభిప్రాయాలు తన కెరీర్ ఒడిదొడుకుల్లో ఎంతో సహాయపడ్డాయని గుర్తు చేసుకున్నారు. కష్ట సమయాల్లో ఎవరూ నిజాలు చెప్పనప్పుడు.. అనుష్క తనకు సరైన మార్గదర్శిగా నిలిచిందన్నారు.

మూడవ అంశం.. ఒక తల్లిగా అనుష్క శ్రమను, అంకితభావాన్ని విరాట్ అద్భుతంగా ఆవిష్కరించారు. పిల్లల పెంపకంలో అనుష్క తీసుకుంటున్న జాగ్రత్తలు, చేస్తున్న త్యాగాలు చూస్తుంటే తనకు ఆమెపై గౌరవం మరింత పెరిగిందన్నారు. కెరీర్‌ను వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక తల్లిగా అనుష్క పోషిస్తున్న పాత్ర తనను నిరంతరం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుందని, ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం తెచ్చే మార్పులను అనుష్క ద్వారానే తాను దగ్గరగా చూశానని ఎమోష‌న‌ల్ అయ్యారు.

నాల్గవది.. తన క్రికెట్ కెరీర్‌లో ఎదురైన అత్యంత క్లిష్టమైన ఫామ్ లేమి సమయంలో అనుష్క తనకు కొండంత అండగా నిలిచిందని విరాట్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచమంతా తనను విమర్శిస్తున్నప్పుడు తన మానసిక ప్రశాంతతకు ఆమె రక్షణ కవచంలా నిలిచిందన్నారు. ఆటలో వచ్చే గెలుపోటములకు అతీతంగా తనను ఒక మనిషిగా ప్రేమించి, తనలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఏకైక వ్యక్తి అనుష్క శర్మ మాత్రమేనని విరాట్ పేర్కొన్నారు.

చివరగా తమ మధ్య ఉన్న నమ్మకం .. స్నేహ బంధం గురించి విరాట్ స్పందించారు. తామిద్దరం భార్యాభర్తల కంటే కూడా ముందు మంచి స్నేహితులమని, ఏ విషయమైనా ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పంచుకోగలమని తెలిపారు. లైమ్‌లైట్‌లో ఉంటూ కూడా సాధారణమైన జీవితాన్ని, కుటుంబ విలువలను ఎలా కాపాడుకోవాలో? అనుష్కను చూసే నేర్చుకున్నానని విరాట్ ముగించారు. ఈ ఐదు విషయాలు విరుష్క‌ మధ్య గాఢమైన ప్రేమకు - పరస్పర గౌరవానికి అద్దం పడుతున్నాయి.

Tags:    

Similar News