ఒక‌రు రెస్ట్ లో..మరోక‌రు పోరాటంలో!

మ‌ధ్య‌లో న‌ట ప్ర‌య‌త్నాలు చేసి మ‌ధ్య‌లోనే డ్రాప్ అయ్యారు. ఇలా వినాయ‌క్ కెరీర్ క‌నిపిస్తుంది. మ‌రి ఈ న‌యా డైరెక్ట‌ర్ కంబ్యాక్ ప్ర‌య‌త్నాలు ఏవైనా చేస్తున్నారా?;

Update: 2025-07-01 07:30 GMT

మాస్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఒక‌ప్పుడు ఎలా వెలిగారో తెలిసిందో. ఇండ‌స్ట్రీకి ఎన్నో మాస్ హిట్లు ఇచ్చారు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. అయితే వినాయ‌క్ రెండేళ్ల‌గా సినిమాలు చేయ‌లేదు. బాలీవుడ్ లో ఛ‌త్ర‌పతి రీమేక్ తో అక్క‌డ ప‌రిచ‌య‌మైనా? వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. ఆ సినిమా త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ మ‌రో సినిమా ప్ర‌క‌టిం చ‌లేదు.

మ‌ధ్య‌లో న‌ట ప్ర‌య‌త్నాలు చేసి మ‌ధ్య‌లోనే డ్రాప్ అయ్యారు. ఇలా వినాయ‌క్ కెరీర్ క‌నిపిస్తుంది. మ‌రి ఈ న‌యా డైరెక్ట‌ర్ కంబ్యాక్ ప్ర‌య‌త్నాలు ఏవైనా చేస్తున్నారా? అంటే అదెక్క‌డా క‌నిపించ‌లేదు. చేసి ఉంటే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేది. దీంతో వినాయ‌క్ సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చేసిన‌ట్లేనా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడు వినాయ‌క్ సినిమాలు చేయాలంటే చాలా అప్ డేట్ అవ్వాలి. పాన్ఇండియా కంటెంట్ తో రావాలి.

అప్పుడే వ‌ర్కౌట్ అవుతుంది. కానీ వినాయ‌క్ అనుభ‌వం నేటి జ‌న‌రేష‌న్ స‌రిపోవ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న ఉంది. మ‌రి ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు వినాయ‌క్ పుల్ స్టాప్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది చూడాలి. మ‌రో వైపు శ్రీను వైట్ల మాత్రం స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఈయ‌న ఎన్నో విజ‌యాలు ఇచ్చిన ద‌ర్శ‌కుడే. కానీ `ఆగ‌డు` నుంచి వైట్ల బ్యాడ్ టైమ్ మొద‌లైంది. అప్ప‌టి నుంచి చేసిన ఏ సినిమా కూడా క‌లిసి రాలేదు.

అన్ని సినిమాలు ప్లాప్ ఖాతాలోనే ప‌డుతున్నాయి. `ఆగ‌డు`, `బ్రూస్ లీ, మిస్ట‌ర్`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`, `విశ్వం` సినిమాల‌తో ఐదు ప్లాప్ లు న‌మోద‌య్యాయి. మ‌రో ప్లాప్ ప‌డితే డ‌బుల్ హ్యాట్రిక్ అవుతుంది. ప్ర‌స్తు తం శ్రీను వైట్ల మాత్రం అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ ఏడాది కొత్త ఛాన్స్ ప‌ట్టుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News