• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విష్వక్‌సేన్ 'కల్ట్'...

విష్వక్‌సేన్ 'కల్ట్' షురూ.. గోట్ మాస్క్ వెనక రహస్యమేంటీ?

| ఈ సినిమా ఒక న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

By - Tupaki Desk
Update: 2025-05-11 08:10 GMT

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి డైరెక్టర్‌గా, రైటర్‌గా, నటుడిగా తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాలతో ఈ ప్రయత్నాలను చూసిన ప్రేక్షకులకు, ఇప్పుడు ఆయన కొత్తగా తీసుకొచ్చిన ‘కల్ట్’ అన్న టైటిల్‌తో ఓ విభిన్న చిత్రాన్ని ప్రకటించాడు. పోస్టర్‌లో కనిపించిన గోట్ మాస్క్, బ్యాక్‌డ్రాప్‌లో కలర్‌ఫుల్ మూమెంట్స్ ను చూస్తేనే ఇది భిన్నమైన కాన్సెప్ట్ అనే సంకేతాలిస్తోంది.




 


ఈ సినిమా ఒక న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. యథార్థ ఘటనల ఆధారంగా తీస్తున్న ఈ కథ, సాదాసీదా థ్రిల్లర్ కాదని, అనూహ్య మలుపులు, మానసిక గందరగోళాల మధ్య నడిచే ప్రయాణం అని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం గ్రాండ్ లాంచ్ జరగ్గా, ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు) లు పాల్గొన్నారు. లాంచ్ అనంతరం అదే రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.

విష్వక్‌సేన్ ఈ సినిమాతో 40మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, కొత్త టాలెంట్‌కు వేదిక కూడా. ఆయన విజన్‌కు అనుగుణంగా టెక్నికల్ టీం కూడా టాప్ లోనే ఉంది. థరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయగా, కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించనున్నారు.

ఆర్వింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవి తేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఆర్వింద్ ములే పనిచేస్తున్నారు. తారక్ సినిమాస్, వన్మయ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు భిన్నంగా, ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని తీస్తున్న సరికొత్త ప్రయత్నం కావడం విశేషం. ‘కల్ట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గోట్ మాస్క్ వేసుకున్న వ్యక్తి, వెనుక ఫెస్ట్ మూడ్, కాన్ఫెట్టీల వర్షం చూస్తే కథ ఎంత డార్క్ అండ్ స్టైలిష్‌గా ఉండబోతోందో ఊహించవచ్చు. విష్వక్‌సేన్ ప్రయోగం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Tags:    
  • CULTMovie 
  • VishwakSen 
  • MassKaDas 
  • NewAgeThriller 
  • TharunBhascker 
  • RaviBasrur 
  • FalaknumaDas 
  • PartyThriller 
  • IndianCinema 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS