కొడుకు హీరో అయినా ఈ హీరో జోరు తగ్గలేదు..!
2026 ప్రారంభంలోనే విక్రమ్, ప్రేమ్ కుమార్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.;
సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు మాత్రమే అయిదు పదుల వయసులో, ఆరు పదుల వయసులో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అతి కొద్ది మంది ఏడు పదుల వయసులోనూ హీరోగా సినిమాలు చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి. సీనియర్ హీరోలు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం, విలన్‌గా సినిమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఫిజిక్ పరంగా యంగ్ హీరోలకు పోటీగా ఉండే కొందరు సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన హీరోగా ఈ ఏడాది ఇప్పటికే 'వీర ధీర సూరన్' సినిమా విడుదలైంది. ఆ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా విడుదలైన వెంటనే విక్రమ్ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి అయితే ఈ ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్
విక్రమ్ 63వ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా నుంచి అతి త్వరలోనే టీజర్‌తో పాటు, టైటిల్ అనౌన్స్‌మెంట్ రావచ్చు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టైటిల్ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ సినిమా తర్వాత విక్రమ్ 64 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌తో చేస్తున్న సినిమా కోసం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విక్రమ్ వంటి స్టార్ హీరోతో ప్రేమ్ కుమార్ సినిమా చేస్తే ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
విక్రమ్ 65వ సినిమాకి రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం
2026 ప్రారంభంలోనే విక్రమ్, ప్రేమ్ కుమార్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు రెండు సినిమాలకు సంబంధించిన వర్క్ ను విక్రమ్ పూర్తి చేస్తాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే వెంటనే మరో సినిమాను విక్రమ్ చేస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే విక్రమ్ 65వ సినిమాకు సంబంధించిన చర్చలు ప్రారంభం అయ్యాయి. విక్రమ్ హీరోగా చేయబోతున్న 65వ సినిమాకి రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈయన పార్కింగ్ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు దక్కించుకున్నారు. విభిన్నమైన లైన్‌తో ఈయన రూపొందిస్తున్న ఈ సినిమా కోసం విక్రమ్ ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడంలో సందేహం లేదు.
ధృవ సినిమాలు
ఒక వైపు రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మూడో సినిమాకు ఓకే చెప్పిన విక్రమ్ జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు. ఒక వైపు విక్రమ్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చాలా స్లో గా సినిమాలు చేస్తున్నారు. కథల ఎంపిక విషయంలో విక్రమ్ తనయుడు ధృవ కాస్త స్లో ఉన్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. కొడుకు స్లోగా సినిమాలు చేస్తూ ఉంటే తండ్రి విక్రమ్ మాత్రం వరుస సినిమాలతో జోరుగా సాగుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తున్నారు. కానీ విక్రమ్ మాత్రం చాలా స్పీడ్‌గా ఒకే సారి మూడు సినిమాలను చేస్తున్నాడు. విక్రమ్ జోరు చూస్తూ ఉంటే కొడుకుకి పోటీగా ముందు ముందు సినిమాలను బాక్సాఫీస్ వద్ద నిలిపే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ 65 సినిమాల మైలు రాయిని చేరబోతున్న నేపథ్యంలో, ఇదే జోరుతో కొనసాగితే ఖచ్చితంగా 100 సినిమాల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.