డాక్టర్ ని మోసం చేసిన డైరెక్టర్ అరెస్ట్...!
బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ విక్రమ్ భట్ పై డాక్టర్ అజయ్ మూర్దియా చీటింగ్ కేసు పెట్టడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేయడం జరిగింది.;
బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ విక్రమ్ భట్ పై డాక్టర్ అజయ్ మూర్దియా చీటింగ్ కేసు పెట్టడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసు గత కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు విక్రమ్ భట్ ను రాజస్థాన్ కి చెందిన ఉదయపూర్ పోలీసులు అరెస్టు చేయడంతో జాతీయ స్థాయి మీడియాలో చర్చనీయాంశం అయింది. డాక్టర్ అజయ్ మూర్దియా నుండి విక్రమ్ భట్ మరియు ఆయన భార్య ఏకంగా 30 కోట్ల రూపాయలను సినిమా తీస్తాం అని తీసుకున్నారట. డాక్టర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తామని ఫిలిం మేకర్ డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్న ఎలాంటి స్పందన లేకపోవడంతో కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. రాజస్థాన్ కి చెందిన డాక్టర్ దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించేందుకు విక్రమ్ భట్ ఒప్పుకున్నాడని అందుకుగాను అడ్వాన్స్ గా 30 కోట్ల రూపాయలను తీసుకొని సినిమాను ప్రారంభించాల్సి ఉండగా మొహం చాటేసాడని సదరు కథనాల్లో పేర్కొంటున్నారు.
ఫిలిం మేకర్ విక్రమ్ భట్ పై కేసు
ఈ కేసులో విక్రమ్ భట్ మరియు ఆయన భార్య మాత్రమే కాకుండా మరో ఆరుగురు కూడా ఉన్నారని తెలుస్తోంది. వీరంతా డాక్టర్ అజయ్ నుంచి 30 కోట్ల రూపాయలు మోసపూరితంగా తీసుకొని ఇప్పుడు సినిమా తీయకుండా మొహం చాటేసారని తెలుస్తోంది. డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా విక్రమ్ భట్ మరియు ఆయన భార్య ఇతర సభ్యులకి పోలీసుల నుండి నోటీసులు వెళ్లాయి. విచారణకు హాజరు కావలసిన వారు పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో అరెస్టు కి దారి తీసింది అని జాతీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు విక్రమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఇప్పటికే ఆయన అరెస్టు కావడంతో డాక్టర్ ను మోసం చేశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ నుండి డబ్బులు తీసుకొని అతడి జీవిత చరిత్ర తీస్తానంటూ నమ్మబలికి ఇప్పుడు మొహం చాటేయడం వల్లే ఫిలిం మేకర్ పై కేసు నమోదయిందని ఎక్కువ శాతం మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది మాత్రం విక్రమ్ భట్ వైపు నుండి క్లారిటీ లేదు.
బాలీవుడ్ దర్శకుడిపై చీటింగ్ కేసు
డాక్టర్ అజయ్ తన దివంగత భార్య కథను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అందుకోసం ఫిలిం మేకర్స్ కి 30 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ సమయంలో విక్రమ్ భట్ ఈ బయోపిక్ ను సినిమాగా తీస్తే తప్పకుండా 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని డాక్టర్ కి ఆశ చూపించినట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ అజయ్ తమ బయోపిక్ తీసేందుకుగాను ఏకంగా 30 కోట్ల రూపాయలను విక్రమ్ భట్ కి అందజేశారని తెలుస్తోంది. డాక్టర్ కి ఆశ చూపించి వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయని నమ్మించి 30 కోట్ల రూపాయలను కాజేసిన దర్శకుడి తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల గురించి పెద్దగా తెలియని డాక్టర్ తో డీలింగ్ కుదుర్చుకోవడం దర్శకుడి మోసపూరిత గుణం అర్థమవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి డాక్టర్ అజయ్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఫిలిం మేకర్ పై కేసు పెట్టడంతో విషయం కాస్త మీడియాకు తెలిసింది. అరెస్ట్ అయిన దర్శకుడు విక్రమ్ భట్ ఇప్పుడు ఏం చేస్తాడా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీలో వరుస ప్లాప్స్
బాలీవుడ్ లో ఈ మధ్యకాలం వరుస ఫ్లాప్స్ నమోదు అవుతున్నాయి, అయినా కూడా సీనియర్ దర్శకులను కొందరు నమ్మి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. వారి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని కొందరు దర్శక నిర్మాతలు పెట్టుబడి పెట్టించి వారిని నష్టపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విక్రమ్ భట్ కి వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ చేస్తూ ఉంటే డాక్టర్ యొక్క అవివేకాన్ని కొందరు విమర్శిస్తున్నారు. ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తారు చివరకు ఇలా మోసపోతారు అంటూ పలువురిని సాక్షాలుగా చూపిస్తూ డాక్టర్ అజయ్ కి సానుభూతి తెలియజేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అని అంటారు. ఈ సంఘటనతో అది మరోసారి నిరూపితమైందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వడం, ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా ఇబ్బంది పడడం చాలా మందికి కామన్ అయ్యింది. కొందరు బాధితులు పోలీసుల ముందుకు వస్తే కొందరు మాత్రం డబ్బు పోగొట్టుకొని బిక్కుబిక్కుమంటారు.