• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ ని డైరెక్ట్...

సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్న అగ్ర హీరో కొడుకు?

| కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-02-22 01:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో జాసన్ ఓ సినిమా చేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కానీ అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కడి దాకా వచ్చింది?, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, సినిమాలో హీరో ఎవరు? అనే విషయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి జాసన్ సంజయ్ వార్తల్లోకి వచ్చింది. ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఫస్ట్ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దుల్కర్ తో చర్చలు జరుగుతున్నాయని, ఆయనకు స్క్రిప్ట్ కూడా బాగా నచ్చిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా మారే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్న దుల్కర్.. పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి హీరోని ఇప్పుడు విజయ్ కొడుకు తన డెబ్యూ మూవీకే డైరెక్ట్ చేయబోతున్నారని వార్తలు రావడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

విజయ్‌ పెద్ద కొడుకు జేసన్ సంజయ్, 2009లో 'వెట్టైక్కారన్‌' మూవీలో తన తండ్రితో కలిసి 'నాన్ అడిచా' పాటలో కనిపించాడు. ప్రస్తుతం అతని వయస్సు 23 ఏళ్లు. తండ్రి బాటలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. 'ఉప్పెన' తమిళ రీమేక్‌తో నటుడిగా మారతాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే అతను మాత్రం తనకు నటన కంటే, దర్శకత్వంపై ఎక్కువ ఆసక్తి ఉందని స్పష్టం చేశాడు. అందుకే టొరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేసి, అటు నుంచి లండన్‌ లో స్క్రీన్ రైటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. నాలుగేళ్ల క్రితం 'సిరి' అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించాడు.

జేసన్ సంజయ్ మొదటి హీరో విజయ్ సేతుపతి అని, దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న తర్వాతే తన తండ్రితో సినిమా చేస్తానని సంజయ్ నమ్మకంగా ఉన్నాడని అప్పట్లో ఆయన గ్రాండ్ ఫాదర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంజయ్ మెగా ఫోన్ పట్టుకొని పూర్తి స్థాయి డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించకపోతే, ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది. డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి హీరోయిన్ గా నటిస్తారని, ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారనే రూమర్స్ కూడా ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్ విషయానికొస్తే, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ బాస్కర్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం - యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్‌' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే సుధా కొంగర దర్శకత్వంలో హీరో సూర్యతో కలిసి 'పురాణనూరు' అనే సినిమా చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చే NBK 109.. రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాల్లో దుల్కర్ స్పెషల్ రోల్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సినిమా చేస్తారేమో చూడాలి.

Tags:    
  • Jasonsanjay 
  • Vijaythalapathy 
  • Thalapathyson 
  • Dulquersalmaan 
  • Lycaproductions 
  • Filmindustry 
  • Kollywood 
  • Dulquer 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS