• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజ‌య్ చివ‌రి సినిమా ...

విజ‌య్ చివ‌రి సినిమా కాంబినేష‌న్ ఇదేనా?

| విజ‌య్ -వెట్రీమార‌న్-దాన‌య్య ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో రాబోతున్న విజ‌య్ చివ‌రి సినిమా అంటూ వినిపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-02-06 23:30 GMT

త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగేసిన సంగ‌తి తెలిసిందే. 2026 ఎన్నిక‌లు టార్గెట్ గా విజ‌య్ సీఎంగా బ‌రిలోకి దిగుతున్నారు. విజ‌య్ కి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి ఉద‌య‌నిధి స్టాలిన్. రాజ‌కీయంలో త‌ల‌పండిన ఫ్యామిలీ నుంచి ఉద‌య్ సీన్ లోకి రావ‌డంతో? 2026 ఎన్నిక‌ల్లో విజ‌య్ ఎలాంటి పోటీనిస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అందుకే విజ‌య్ కూడా తాజాగా సెట్స్ లో ఉన్న సినిమా త‌ర్వాత మ‌రొక్క సినిమా చేసి సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించ‌డం జ‌రిగింది.

దీంతో విజ‌య్ చివ‌రి సినిమా ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అత‌డితో చివ‌రిగా ప‌నిచేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అంటూ ఒకటే చ‌ర్చ సాగుతుంది. `వార‌సుడు`తో టాలీవుడ్ లోనూ లాంచ్ అయిన నేప‌థ్యంలో తెలుగు సినిమాతో ముగిస్తాడా? సొంత భాష సినిమాతో గుడ్ బై చెబుతాడా? అని ఒకటే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే నిర్మాత‌గా ఆ ఛాన్స్ డి.వివి. దాన‌య్య‌కి ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం కూడా సాగింది.

తాజాగా దీనికి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రానికి వెట్రిమా ర‌న్ దర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కొత్త ప్ర‌చారం మొద‌లైంది. విజ‌య్ -వెట్రీమార‌న్-దాన‌య్య ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో రాబోతున్న విజ‌య్ చివ‌రి సినిమా అంటూ వినిపిస్తుంది. అయితే త‌మిళ నిర్మాత‌ల్ని కాద‌ని విజ‌య్ చివ‌రి సినిమా ఛాన్స్ తెలుగు నిర్మాత‌కి ఎలా ఇస్తాడు? అన్న‌ది అతి పెద్ద సందేహం. అత‌న్ని హీరోచేసింది అక్క‌డి నిర్మాత‌లు. అక్క‌డి ప్రేక్ష‌కులు.

కోలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. అలాంటప్పుడు వాళ్ల నిర్మాత‌ల్ని కాద‌ని తెలుగు నిర్మాత‌కు ఎలా ఛాన్స్ ఇస్తాడు? అన్న‌ది సీరియ‌స్ గా ఆలోచించాల్సిన విష‌య‌మే. ప్ర‌స్తుతం విజ‌య్ ....వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్ ని బ‌ట్టి విజ‌య్ చివ‌రి సినిమా ఇదే అవుతుందా? అన్న‌ది మ‌రో సందేహం. విజ‌య్ చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించింది సెట్స్ లో ఉన్న ఈ సినిమా గురించా? లేక మ‌రో కొత్త సినిమా గురించా? అంటూ కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై కూడా విజయ్ ఓ క్లారిటీ ఇస్తే బాగుండేది.

 

Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024
Tags:    
  • Vijaythalapathy 
  • Politics 
  • Movies 
  • Tollywood 
  • Varasudu 
  • Vamshipadipally 
  • Leo2 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS