విజయేంద్ర ప్రసాద్ కథ తో బాలయ్య ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా... అందులో ఎన్ని హిట్ అయ్యాయంటే...

ఒక సినిమాకి కథ కీలకం. స్టోరీ లో కొత్తదనం ఉంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుడు ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతాడు.

Update: 2026-10-03 04:09 GMT

ఒక సినిమాకి కథ కీలకం. స్టోరీ లో కొత్తదనం ఉంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుడు ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతాడు. అందుకే ఏ ఇండస్ట్రీ లో అయిన కథ రచయితలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగులో 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపును సంపాదించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్... కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు రచయితగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విజయేంద్రప్రసాద్ బాలయ్య బాబు హీరోగా చేసిన 5 సినిమాలకి కథలను అందించాడు.

బొబ్బిలి సింహం

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన 'బొబ్బిలి సింహం' మూవీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా...అయితే ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో బాలయ్య బాబు వాటిని అద్భుతంగా పండించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. బాలయ్యను స్క్రీన్ మీద చూసిన అభిమానులు సైతం తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు అంటే ఈ సినిమాలో బాలయ్య ఎమోషనల్ సన్నివేశాల్లో ఏ రేంజ్ లో నటించి మెప్పించాడో మనం అర్థం చేసుకోవచ్చు...

యువరత్న రాణా

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'యువరత్న రాణా' సినిమాకి సైతం విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు...స్టోరీ పర్లేదు అనిపించుకున్నప్పటికి సినిమా ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు...

సమరసింహ రెడ్డి

బాలయ్య బాబుతో ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే అదిరిపోతుందని విజయేంద్రప్రసాద్ కి తట్టిన ఒక ఆలోచన కారణంగా 'సమరసింహారెడ్డి' సినిమా కథ రాసుకున్నాడు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా బాలయ్య బాబుకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం... ఇక బాలయ్య బాబు సినిమా విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆయన మొదటి నుంచి కూడా ఒక సినిమా సక్సెస్ ను సాధించాలంటే కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని దర్శకులకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడట. అందుకే కథ రచయితలకు బాలయ్య చాలా ఎక్కువ వాల్యూ ఇస్తుంటాడు. ఇక విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ ని నమోదు చేయడంతో పాటు ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలకు ఈ మూవీ ఇన్స్పిరేషన్ గా మారింది...

విజయేంద్రవర్మ

ఒక ఆర్మీ ఆఫీసర్ తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు తీవ్రవాదుల నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ బాగుంటుంది. కానీ స్క్రీన్ ప్లే లో తేడా కొట్టింది. దర్శకుడు అనుకున్న పాయింట్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యాడు. విజువల్స్ కూడా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాయి. ఇక దానికి తోడు దర్శకుడి యొక్క పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి బోర్ కొట్టించింది. తద్వారా సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ను సాధించలేక పోయింది.

మిత్రుడు

ఈ సినిమా కథ ఒకే అనిపించినప్పటికి బాలయ్య ఆ టైమ్ లో వరుస ప్లాప్ లో ఉండడం వల్ల ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజైంది. తద్వారా ప్రేక్షకుడిని ఎంత మేరకు ఈ మూవీ మెప్పించలేకపోయింది. తద్వారా సినిమా డిజాస్టర్ గా మారింది...

బాలయ్య బాబు కోసం విజయేంద్రప్రసాద్ ఐదు సినిమాలకు కథలను అందించగా అందులో బొబ్బిలి సింహం సూపర్ హిట్ అవ్వగా, సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ రెండు సినిమాలను మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు కూడా అనుకున్న మేరకు విజయాలను సాధించకపోవడంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. ఇక ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కేవలం రాజమౌళి చేస్తున్న సినిమాలకు మాత్రమే కథలను అందిస్తున్నాడు. గతంలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, బాలయ్య ముగ్గురి కాంబోలో ఒక మూవీ రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ మూవీ మిస్ అయింది. ఇక ఫ్యూచర్ లో వీళ్ళ ముగ్గురి కాంబోలో మూవీ వర్కౌట్ అవుతుందేమో చూడాలి...

Tags:    

Similar News