• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి బరిలోనే...

సంక్రాంతి బరిలోనే విజయ్​.. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే

| ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకుందని చెప్పారు మేకర్స్. సంక్రాంతి పండగకు గ్రాండ్​గా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-09-27 06:47 GMT

రానున్న సంక్రాంతి పండగ.. మూవీ లవర్స్​ అందరికీ సందడి సందడిగా మారనుంది. ఇప్పటికే మహేశ్​ బాబు 'గుంటూరు కారం', నాగార్జున 'నా సామి రంగా', ప్రశాంత్ వర్మ 'హనుమాన్', రవితేజ 'ఈగల్' ఈ పండక్కి రానుండగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనున్నట్లు మరోసారి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు ఆ సినిమా మేకర్స్​.


ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీతారణం సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా చేస్తోంది. సినిమా రిలీజ్ డేట్​ను క్లారిటీ చేయడంతో పాటు షూటింగ్ ప్రొగ్రెస్​ వివరాల గురించి కూడా తెలిపారు మేకర్స్​. తమ ప్రొడక్షన్​ హౌస్​ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​ సోషల్ మీడియా అధికార ట్విటర్​లో ఈ విషయాల్ని పోస్ట్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకుందని చెప్పారు మేకర్స్. సంక్రాంతి పండగకు గ్రాండ్​గా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేయనున్నట్లు మూవీ మేకర్స్​ అనౌన్స్​ చేశారు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్​టైనర్​ 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ-దర్శకుడు పరశురామ్ కాంబినేషన్​లో ఈ సినిమా రావడంతో మూవీపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్​గా దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దుతున్నారట. ఇకపోతే ఎస్వీసీ బ్యానర్​లో రానున్న 54వ చిత్రమిది. దిల్ రాజు - శిరీష్​ కలిసి సినిమాను గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్​గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఇంకా మూవీ టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్, సంగీతం : గోపీసుందర్, ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Tags:    
  • Vijaydevarakonda 
  • Kushimovie 
  • Parasurampetla 
  • Srivenkateswaracreations 
  • Mrunalthakur 
  • VD13movie 
  • Dilraju 

Similar News

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?

2026-11-07 05:11 GMT

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

Copyright @2026

Powered by Blink CMS