• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో షూటింగ్ కోసం...

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

| రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రళయ్’ సినిమా షూటింగ్ వివాదంలో చిక్కుకుంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఆరు గంటల షూటింగ్‌కు మహారాష్ట్ర క్రీడా శాఖ అనుమతివ్వడంతో అండర్-14, అండర్-16 క్రికెట్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్రీడాకారుల భవిష్యత్తు కంటే షూటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

By - Sivaji Kontham
Update: 2026-11-07 02:42 GMT

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ `దురంధ‌ర్` ఫ్రాంఛైజీతో గ్రేట్ కంబ్యాక్ అంటే ఏంటో చూపించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ తరుణంలో త‌దుప‌రి చిత్రం `ప్రళయ్` షూటింగ్ పైనే అత‌డు దృష్టి సారించాడు. అయితే ఈ చిత్రం ప్రారంభమైన తొలి దశలోనే ఊహించని వివాదంలో చిక్కుకుంది. ముంబైలోని అత్యంత ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మక ఆజాద్ మైదాన్ లో సినిమా చిత్రీకరణకు మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ అనుమతి మంజూరు చేయడం ఈ వివాదానికి ప్రధాన కేంద్రబిందువైంది. `ధురంధర్` సక్సెస్ తర్వాత ర‌ణ్‌వీర్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం మైదాన్‌ను కేటాయించడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్ర స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమా నిర్మాతలు `లైట్ రేస్` బ్యానర్‌కు 5000 చదరపు గజాల పరిధిలో 6 గంటల పాటు షూటింగ్ చేసుకునేందుకు అనుమతులిచ్చింది. దీనికోసం నిర్మాతల నుంచి రూ. 40,000 అద్దెతో పాటు రూ. 40,000 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేశారు. అయితే ఈ నిర్ణయం వల్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ముందస్తుగా షెడ్యూల్ చేసిన అండర్-14, అండర్-16 ఇంటర్-స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లను అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో క్రీడా ప్రాంగణాన్ని కమర్షియల్ షూటింగ్‌లకు కేటాయించడంపై ఎంసీఏ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

ఈ పరిణామంపై ఎంసీఏ ఏపెక్స్ కౌన్సిల్ సభ్యుడు నదీమ్ మేమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఆజాద్ మైదాన్ చరిత్రలో ఒక సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. భావి తరాల అంతర్జాతీయ క్రికెటర్లను తీర్చిదిద్దే క్రీడా మైదాన్ లో భారీ సెట్లు వేసి, కృత్రిమ గడ్డి పరిచి మ్యాచ్‌లను అడ్డుకోవడం ఎంతమాత్రం తగదని.. క్రీడలను ప్రోత్సహించాల్సిన శాఖే ఇలా కమర్షియల్ బుకింగ్స్ చేయడం వల్ల జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

పిచ్‌లపైకి వాహనాలు తీసుకురాకూడదని.. గ్రౌండ్‌కు నష్టం కలిగించకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించినా మ్యాచ్‌లు రద్దు కావడంపై క్రీడాకారులు, నిర్వాహకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. రానున్న‌ రోజుల్లో క్రీడా మైదాన్ల కమర్షియలైజేషన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఎంసీఏ డిమాండ్ చేస్తోంది. సినిమా షూటింగ్‌ల కంటే ఎదుగుతున్న‌ క్రీడాకారుల భవిష్యత్తే ప్రాధాన్యత కలిగి ఉండాలని క్రీడా ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో స్టేడియాలు- చారిత్రాత్మక క్రీడా మైదానాల్లో సినిమాల‌ షూటింగ్‌లు నిర్వహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖలతో పాటు మైదానాలను నిర్వహించే క్రికెట్ అసోసియేషన్ల (ఉదాహరణకు బీసీసీఐ, ఎంసీఏ) అనుమతులు తప్పనిసరి. సాధారణంగా షూటింగ్ కోసం నిర్దిష్టమైన విస్తీర్ణం.. సమయాన్ని బట్టి నిర్ణీత అద్దెతో పాటు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను నిర్మాతల నుండి వసూలు చేస్తారు. దీనికి తోడు స్థానిక పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (ఎన్.వో.సీ) పొందడంతో పాటు గ్రౌండ్ పరిరక్షణపై అండర్‌టేకింగ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అయితే క్రీడా ప్రాంగణాల్లో షూటింగ్‌లు అనుమతించేటప్పుడు పిచ్ పరిరక్షణ -క్రీడాకారుల షెడ్యూల్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన పిచ్‌లపైకి భారీ వాహనాలు, కెమెరా క్రేన్లు లేదా తవ్వకాలు జరపడం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ ముందస్తుగా నిర్ణయించిన క్రీడా పోటీలు లేదా ప్రాక్టీస్ సెషన్లు ఉన్నట్లయితే.. కమర్షియల్ షూటింగ్‌ల కంటే క్రీడలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్‌ల షెడ్యూల్‌కు భంగం కలిగే పరిస్థితి ఏర్పడితే స్పోర్ట్స్ అథారిటీలు ఇచ్చిన అనుమతులను నిలిపివేసే లేదా రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి.

Tags:    
  • ranveersingh 
  • pralay 
  • azadmaidan 
  • bollywood 
  • filmshooting 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS