• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ...

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

| బాలీవుడ్ నటి కృతి సనన్ తన 12 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు బికినీలో నటించలేదని, ఇటీవల వచ్చిన ‘కాక్‌టైల్ 2’లోనే తొలిసారి ఆ సన్నివేశంలో కనిపించానని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు సౌకర్యంగా ఉండేది కాదని తెలిపారు. వయస్సు, అనుభవంతో పాటు తనపై తనకు నమ్మకం పెరిగిందని, శరీరాకృతి కంటే ఆత్మవిశ్వాసమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

By - Sivaji Kontham
Update: 2026-11-07 04:04 GMT

బికినీ వేయ‌మ‌ని లేదా హ‌ద్దుమీరి ఎక్స్ పోజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒత్తిళ్లు తెస్తే వెంట‌నే దానికి ఒప్పుకోవాలా? కొంద‌రు క‌థానాయిక‌లకు ఈ విష‌యంలో అభ్యంత‌రాలున్నాయి. బో*ల్డ్ ఫోటోషూట్లు లేదా మితిమీరిన గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి అంద‌రూ అంగీక‌రించ‌లేరు. బాలీవుడ్ లో 12 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ నటి కృతి సనన్ ఇటీవల జాతీయ మీడియా వేదికగా తన వ్యక్తిగత ఎదుగుదల- ఆత్మవిశ్వాసంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తను కెరీర్ ఎప్పుడో ప్రారంభించినా కానీ, ఇటీవ‌ల వ‌చ్చిన‌ `కాక్‌టైల్ 2`లో త‌ప్ప బికినీలో న‌టించ‌లేద‌ని కృతి తెలిపారు. ఈ చిత్రంలోని బికినీ సీన్ గురించి ప్రస్తావిస్తూ.. గ్లామర్ రంగంలో ఒక నటిగా తన ఆలోచనా విధానం కాలక్రమేణా ఎలా మారిందో స్పష్టంగా చెప్పుకొచ్చారు.

కృతి సనన్ తన వ్యాఖ్యలలో ప్రధానంగా మానసిక పరిణతికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం తన కెరీర్ ప్రారంభ దశలో ఇటువంటి సన్నివేశంలో నటించాల్సి వస్తే తాను ఎంతమాత్రం సౌకర్యవంగా ఫీల‌య్యేదాన్ని కానని ఓపెన్‌గా అంగీకరించారు. వయస్సు పెరగడం.. పరిశ్రమలో సంపాదించిన అనుభవం.. స్వీయ‌ వ్యక్తిత్వంపై ఏర్పడిన నమ్మకమే ఈ రోజు తనను ఈ స్థాయి సెల్ఫ్ అగ్రీ దిశగా నడిపించాయని వివరించారు.

శరీర ఆకృతి గురించి మాట్లాడుతూ కృతి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. కేవలం శారీరక దారుఢ్యం కలిగి ఉండటం కంటే.. ఒక వ్యక్తి తన శరీరంలో పూర్తి సహజంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటమే అత్యంత కీలకమైన అంశమని నొక్కి చెప్పారు. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత ఆత్మవిశ్వాసమే నిజమైన సౌకర్యాన్ని.. ధైర్యాన్ని అందిస్తుందని కృతి స‌నోన్ అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా.. నటన - కెరీర్ విషయంలో తనకు తానే అతిపెద్ద విమర్శకురాలినని కృతి పేర్కొన్నారు. ప్రతీ సినిమా పూర్తయిన తర్వాత తన ప్రదర్శనను నిశితంగా విశ్లేషించుకుంటూ.. లోపాలను సరిదిద్దుకుంటూ మరింత మెరుగ్గా రాణించేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ గ్రోత్ మైండ్‌సెట్ వల్లనే తాను నటిగా.. వ్యక్తిగా నిలకడైన పురోగతి సాధించగలిగానని వెల్లడించారు.

కృతి సనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో న‌టీమ‌ణులు ఎదుర్కొనే బాడీ ఇమేజ్ ఒత్తిడులు, వ్యక్తిగత ఎంపికల స్వేచ్ఛ.. వయస్సుతో పాటు వచ్చే ఆత్మవిశ్వాసంపై సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. పరిశ్రమలోని ప్రమాణాల కోసం కాకుండా..త‌మ‌ మానసిక సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు అర్థ‌మ‌య్యేలా కృతి చెప్పారు. కృతి త‌దుప‌రి మ‌డాక్ ఫిలింస్ లో హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. భేధియా 2 లోను న‌టిస్తోంది.

Tags:    
  • kritisannon 
  • cocktail2 
  • bollywoodactress 
  • bodyconfidence 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS