విజ‌య‌శాంతి ఇంకా డేర్ చేస్తారా?

`స‌రిలేరు నీకెవ్వ‌రు`తో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి మ‌ళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-25 21:30 GMT

`స‌రిలేరు నీకెవ్వ‌రు`తో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి మ‌ళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాలు..రాజ‌కీయాలు చేసి విరామం తీసుకుంటున్న స‌మ‌యంలో అనీల్ వెళ్లి? విజ‌య శాంతిని ఒప్పించి ఆ సినిమాలో న‌టింప‌జేసారు. న‌టించ‌డం ఇష్టం లేక‌పోయినా మ‌హేష్- అనీల్ కోర‌డంతో కాద‌న‌లేక న‌టించారు. త‌న న‌ట‌నా జీవితం ఎప్పుడో ముగించాన‌ని మ‌ళ్లీ సినిమాలు చేయ‌న‌న్నారు.

అయితే కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఇటీవ‌ల రిలీజ్ అయిన `అర్జున్ స‌న్నాఫ్ వైజయంతి`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య‌శాంతి శ‌క్తివంత‌మైన పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఒక‌ప్ప‌టి విజ‌య‌శాంతిని చూసిన‌ట్లే అనిపించింది అభిమానుల‌కు. వ‌య‌సు పెరిగినా త‌న‌లో యాక్ష‌న్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. దీంతో విజ‌య‌శాంతిలో నూత‌నొత్సాహం మొద‌లైంది.

మ‌ళ్లీ మ‌న‌సు సినిమాలు కోరుకుంటుంది? అన్న ఆస‌క్తిని వ్య‌క్తం చేసారు. యాక్ష‌న్ చిత్రాలు చేయాల‌ని.. ఒకప్ప‌టి రాముల‌మ్మ ను మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు చూపించాల‌నుకుంటున్న‌ల్లు తెలిపారు. త‌న ప‌రంగా ద‌ర్శ‌కుల‌కు అన్ని ర‌కాలుగా స‌హ‌కారం ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు. ఏజ్ జ‌స్ట్ నెంబ‌ర్ మాత్ర‌మే న‌ని..త‌న‌లో ఇంకా యాక్ష‌న్ స‌త్తా ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌యశాంతి వ‌య‌సు 58 ఏళ్లు.

మ‌రో రెండేళ్లు పూర్త‌యితే ష‌ష్టి పూర్తి వ‌చ్చేస్తుంది. అయినా రాముల‌మ్మ ప‌లుగు, ఈటె ప‌ట్ట‌డానికి సిద్ద‌మే. అయితే ఆమెతో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేయాలంటే? ప్ర‌త్యేకంగా ఇప్పుడు క‌థ‌లు సిద్దం చేయ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. విజ‌య‌శాంతి వెట‌ర‌న్ న‌టి ఖాతాలోకి వెళ్లిపోతారు. న‌వ‌త‌రం ద‌ర్శ‌క, ర‌చయి త‌లంతా స్టార్ డ‌మ్ ఉన్న భామ‌ల‌తోనే సినిమాలు చేయాల‌ని చూస్తున్నారు. వాళ్ల‌తో పోటీ ప‌డి రాముల‌మ్మ అవ‌కాశం అందుకోవ‌డం అంత ఈజీ కాదు.

Tags:    

Similar News