పదే పదే డౌట్లు పెట్టేస్తూ.. CM సార్ తల్లిదండ్రుల చెంతనే ఆ సెల్యూట్ ఏంటి?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో శనివారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విజయ్, త్రిషల మధ్య ఉన్న సాన్నిహిత్యం కోలీవుడ్‌లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్కే. ముఖ్యంగా దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత త్రిష ఆయనతో కలిసి పలుమార్లు వేడుకల్లో కనిపించడం నెటిజనుల ఊహలకు రెక్కలు తొడిగింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు త్రిష హాజరుకావడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో శనివారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ అధికారిక కార్యక్రమానికి పసుపు రంగు చీరలో వచ్చిన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలో విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌ల పక్కనే ఠీవిగా కూర్చుని.. విజయ్‌కి గౌరవంగా అభివాదం (సెల్యూట్) చేస్తూ కనిపిండంతో ప్రతి ఒక్కరి దృష్టి తనపైనే పడింది. అయితే త్రిష సెల్యూట్ చేసేప్పుడు విజయ్ వైపే తీక్షణంగా చూస్తూ చిరునవ్వులు చిందించడాన్ని అభిమానులు వెంటనే పసిగట్టేసారు. ఇదే సమయంలో మే 10న జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా త్రిష హాజరైన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు అభివాదంతో పాటు త్రిష బ్యూటిఫుల్ స్మైల్ గురించి కూడా అభిమానులు పదే పదే మాట్లాడుకుంటున్నారు.
నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ - త్రిష రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా రకరకాల వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసి తిరిగి ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో కోర్టు ఆ కేసును క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రుల చెంతనే త్రిష ఆత్మీయంగా మెదలడం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర గుసగుసలకు దారితీసింది.
ఇక సినిమాల విషయానికొస్తే త్రిష ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. తను చివరిగా కోలీవుడ్ స్టార్ సూర్య సరసన `కరుప్పు` చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 238 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
అంతేకాకుండా త్రిష చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `విశ్వంభర` చిత్రంలో కథానాయికగా నటించారు. దీంతో పాటు మలయాళంలో స్టార్ హీరో మోహన్‌లాల్-జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామ్` లోనూ త్రిష నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. భార్య సోర్నలింగం అవకాశం కోల్పోయినా.. స్నేహితురాలు త్రిషకు ఆ అవకాశం దక్కింది.. దళపతి ది గ్రేట్! అంటూ అభిమానులు కూడా సెల్యూట్ చేస్తున్నారు.