• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మభాష మీద మమకారం అంటే...

అమ్మభాష మీద మమకారం అంటే ఇది కదా? రియల్ హీరో సేతుపతి

| హీరో అంటే.. వెండి తెర మీద హీరోయిజం చూపించటమేనా? తెర మీద దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా చేసేయటం ద్వారా కోట్లాది మంది మనసుల్ని దోచేసి.. వందల కోట్లు సంపాదించేటోళ్లు చాలామంది నటులు ఉండొచ్చు.

By - Tupaki Desk
Update: 2025-01-30 04:47 GMT

హీరో అంటే.. వెండి తెర మీద హీరోయిజం చూపించటమేనా? తెర మీద దర్శకుడు చెప్పింది తూచా తప్పకుండా చేసేయటం ద్వారా కోట్లాది మంది మనసుల్ని దోచేసి.. వందల కోట్లు సంపాదించేటోళ్లు చాలామంది నటులు ఉండొచ్చు. కానీ.. వారిలో కొందరు మాత్రం జనం గుండెల్లో నిలిచిపోతారు. తాను పుట్టిన ప్రాంతం.. తన జాతి కోసం వారు వ్యవహరించే తీరు.. వారు ప్రదర్శించే కమిట్ మెంట్ కు ఫిదా కాకుండా ఉండలేం. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేశారు.

నిజానికి లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొనే ఈ సమస్యను ఆయన అప్పీల్ చేసిన తీరు చూస్తే.. ఇలాంటోడు కదా అసలుసిసలు రియల్ హీరో అనుకోకుండా ఉండలేం ఇంతకూ ఆయనేం చేశారంటే.. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని కార్డు మీద ఇంగ్లిషు.. హిందీలోనే కాకుండా తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని కోరారు. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్నఆయన మాట్లాడుతూ.. పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ.. ఇంగ్లిషు భాషల్లోనే అందబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కారణంగా.. ఈ రెండు భాషలు రాని వారు పాన్ కార్డు అప్ డేట్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తమిళ భాషను యాడ్ చేయటం కష్టమైనప్పటికి ప్రయత్నించాలన్నారు. పాన్ కార్డు వెబ్ సైట్ తమిళ భాషలో సమాచారం అందుబాటులో ఉంటే మరింత మందికి చేరువ అవుతుందన్నారు.

పాన్ కార్డు వివరాలు.. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే వెబ్ సైట్ తమిళంలో ఉంటే.. ప్రజలు గందరగోళానికి గురి కారన్న ఆయన.. భాషతో సంబంధం లేకుండా పౌరులందరికి అవసరమైన ఆర్థిక సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేలా పాన్ కార్డు అప్డేడేషన్ విషయంలో బహుళ భాషలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

సామాన్య ప్రజలు నిజ జీవితంలో ఎదుర్కొనే అత్యంత కీలక సమస్యను గుర్తించటమే కాదు.. కేంద్రానికి అప్పీలు చేయాలన్న ఆలోచన.. విజయ్ సేతుపతి మీద రెస్పెక్టును టన్నుల కొద్దీ పెంచేస్తుందని చెప్పాలి. ఇదే తీరులో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొనే సామాన్య అంశాల్ని సినీ హీరోలు.. ప్రముఖులు ప్రస్తావించటం ద్వారా.. ప్రభుత్వాలు వెంటనే స్పందించే వీలు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Actor #VijaySethupathi has appealed to the Centre, requesting that information and updates related to #PAN cards be made available in Tamil, along with Hindi and English. He emphasized that problems can be solved more easily when information is provided in a language people… pic.twitter.com/xcPQyTI9g5

— Tupaki (@tupaki_official) January 30, 2025
Tags:    
  • Vijaysethupathi 
  • Kollywood 
  • Government 
  • Pancard 
  • Website 
  • Tamil 
  • Tamilnadu 
  • Latestnews 

Similar News

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS