పూరీ బ్లైండ్ గా వస్తున్నాడంటే..?

పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.;

Update: 2026-01-19 06:02 GMT

పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అది చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. విజయ్ సేతుపతితో పూరీ ఒక బెగ్గర్ స్టోరీ చేస్తున్నాడని టాక్. ఐతే సినిమాలో విజయ్ సేతుపతి బ్లైండ్ గా కనిపించనున్నారు. బ్లైండ్ బెగ్గర్ గా విజయ్ సేతుపతి ఎలాంటి హంగామా చేస్తాడన్నది చూడాలి. ఐతే హీరో బ్లైండ్ రోల్ కాస్త రిస్క్ అనే చెప్పాలి. కానీ విజయ్ సేతుపతి బ్లైండ్ రోల్ అనగానే హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. సాధారణంగా కథ బాగుంటేనే ఆ సినిమాలో విజయ్ సేతుపతి యాక్టింగ్ అదిరిపోతుంది.

ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగ రాసిన..

పూరీ డైరెక్షన్ లో బెగ్గర్ క్యారెక్టర్.. అది కూడీ బ్లైండ్ రోల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని చెప్పొచ్చు. పూరీ కూడా ఈసారి తన సత్తా చాటే కథతోనే వస్తున్నాడని అనిపిస్తుంది. పూరీ బ్లైండ్ హీరో కథతో వస్తున్నాడంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగ రాసిన హిస్టరీ పూరీకి ఉంది. ఐతే ఈమధ్య వరుస ఫ్లాపులతో ఆయనతో సినిమా అంటేనే హీరోలు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది.

ఐతే మక్కల్ సెల్వన్ మాత్రం పూరీ ఎక్స్ పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకునే ఈ స్లమ్ డాగ్ సినిమాకు సైన్ చేసి ఉండొచ్చు. సినిమా ఫస్ట్ లుక్ ఐతే ఇంప్రెస్ చేసింది. బ్లాక్ గాగుల్స్ తో విజయ్ సేతుపతి క్రేజీగా ఉన్నాడు. సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు, దునియా విజయ్ లాంటి వాళ్లు భాగం అవుతున్నారు.

పూరీ మనసు పెట్టి సినిమా తీస్తే..

పూరీ మనసు పెట్టి సినిమా తీస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఆయన సృష్టించిన ఇండస్ట్రీ రికార్డుల సినిమాలు చూశాం. ఐతే కెరీర్ చాలా టఫ్ టైం నడుస్తుండగా విజయ్ సేతుపతితో పూరీ నెక్స్ట్ లెవెల్ సినిమాతో రాబోతున్నారు. స్లం డాగ్ చూస్తుంటే ఈ సినిమాతో పూరీ సూపర్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ ఉంది.

పూరీ సినిమాల్లో హీరోలు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి పూరీ సినిమాలు పట్టించుకోవట్లేదు కానీ పూరీ మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని సినీ లవర్స్ కోరుతున్నారు. పూరీ జగన్నాథ్ రైటింగ్ స్టామినా ఏంటో మరోసారి స్లమ్ డాగ్ మూవీతో ప్రూవ్ చేస్తాడని చెబుతున్నారు. విజయ్ సేతుపతి కూడా సినిమా అవుట్ పుట్ మీద చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాడని తెలుస్తుంది. విజయ్ సేతుపతితో పూరీ చేస్తున్న స్లం డాగ్ తెలుగు, తమిళ ఆడియన్స్ ని ఎంతమేరకు అలరిస్తుంది అన్నది చూడాలి. పూరీ మాత్రం ఈ సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడని అర్థమవుతుంది.

Tags:    

Similar News