సేతుపతి ఫార్ములా.. హిట్ ఫ్లాప్ నో వర్రీ!
ఇక మరోసారి మిస్కిన్ డైరెక్షన్‌లో 'ట్రైన్' మూవీ చేస్తున్న విజయ్ సేతుపతి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేసిన విషయం తెలిసిందే.;
ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే పలకరిస్తారు. మరో సినిమా ఇస్తారు. కానీ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విషయంలో మాత్రం ఇది రివర్స్. హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ వస్తున్నాడు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ప్రతీ ఏడాది 2 నుంచి 3 సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ ఏడాది సోలో హీరోగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది నాలుగు క్రేజీ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
హిట్‌లు, ఫ్లాప్‌లు పక్కన పెడితే క్రేజీ లైనప్ ముఖ్యమని గుర్తు చేస్తున్నాడు. వరుస సినిమాలతో నిరంతరం పని చేసే స్టార్‌గా మార్కెట్‌లో విజయ్ సేతుపతికి మంచి బజ్ ఉంది. ఈ ఏడాది అరవింద్‌స్వామి, అదితీరావు హైదరీతో కలిసి 'గాంధీ టాక్స్'లో నటిస్తున్నాడు. ఈ మూవీ జనవరి 30న రిలీజ్ కాబోతోంది. ఇదొక మూకీ మూవీ. సైలెంట్ బ్లాక్ కామెడీ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై అంచనాలున్నాయి.
దీని తరువాత మిస్కిన్ వివాదాస్పద మూవీ 'పిసాసు 2' రానుంది. ఫైనాన్షియల్ క్రైసిస్, నిర్మాణ సంస్థ చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో గత కొంత కాలంగా రిలీజ్‌కు నోచుకోని ఈ మూవీ ఇదే ఏడాది ప్రేక్షకులని పలకరించబోతోంది. విజయ్ సేతుపతి చేస్తున్న మరో యాక్షన్ డ్రామా 'అరసన్'. వెట్రిమారన్ డైరెక్టర్. శింబు హీరోగా నటిస్తున్నాడు. 'వడాచెన్నై' యూనివర్స్‌లో భాగంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది కూడా ఈ ఇయరే రిలీజ్ కానుంది.
ఇక మరోసారి మిస్కిన్ డైరెక్షన్‌లో 'ట్రైన్' మూవీ చేస్తున్న విజయ్ సేతుపతి టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేసిన విషయం తెలిసిందే. 'స్లమ్‌డాగ్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. అన్ని కుదిరితే ఫిబ్రవరిలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రావచ్చు. వీటితో పాటు రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2'లో సేతుపతి గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా హిట్ ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా ఏడాదికి 2 నుంచి 3 సినిమాలు చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.