ఘాటుగా పార్వతి ఫోటో షూట్.. స్పెషల్ ఏంటి?

ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పార్వతి మెల్టన్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు.;

Update: 2026-03-05 00:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పార్వతి మెల్టన్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. స్టైలిష్ ఫోటో షూట్ కారణంగా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఇన్‌ స్టాగ్రామ్‌ లో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



 


ఆ ఫోటోలను అమెరికాకు చెందిన ఫోటోగ్రఫీ టీమ్ లిండీ పారిస్ ఫొటోగ్రఫీ షేర్ చేసింది. ఆ ఫోటోల్లో పార్వతి మెల్టన్ మరో మోడల్ రోజ్ గెర్బర్ తో కలిసి కనిపించారు. నార్మల్ గ్లామర్ ఫోటోల కంటే భిన్నంగా.. వింటేజ్ థీమ్‌ తో చేసిన ఆ షూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలంగా బయట కనిపించని పార్వతిని ఇలా ఫోటో షూట్ లో చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



 


ఎంబ్రేసెడ్ ఇన్ ఎలిగెన్స్ అనే క్యాప్షన్‌ తో ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. ఏ ఫోటో బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవడం కష్టం కావడంతో అన్నింటినీ షేర్ చేశామని ఫోటోగ్రాఫర్ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. రోజ్ గెర్బర్‌ కు కేటీఫ్ఎక్స్ పీడీఎక్స్ మేకప్ చేయగా.. కాస్ట్యూమ్స్‌ ను రెంట్ విత్ అలీనా అందించారు. ఆ షూట్ మొత్తం ఛటెయ్ డిలీస్ Chateau Delis అనే లొకేషన్‌ లో జరిగిందట.



 


స్పెషల్ సెటప్, లైటింగ్, బ్యాక్‌ డ్రాప్ ఫోటోలకు మరింత అందం తీసుకొచ్చాయి. ఫోటోల్లో పార్వతి మెల్టన్ డార్క్ కలర్ డ్రెస్సులు ధరించి, మిస్టీరియస్ లుక్‌ లో కనిపిస్తున్నారు. ఓవరాల్ గా లైటింగ్, స్టైలింగ్ చూస్తే హాలీవుడ్ వెబ్ సిరీస్ పోస్టర్‌ లా అనిపిస్తుందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఏదైనా ప్రాజెక్ట్ షూట్‌ లో భాగమా.. లేక కేవలం క్రియేటివ్ ఫ్యాషన్ ఫోటోషూట్ మాత్రమేనా అని అడుగుతున్నారు.



 


ఇక పార్వతి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తండ్రి సామ్ మెల్టన్ జర్మన్-స్కాటిష్ వంశానికి చెందిన వారు కాగా.. తల్లి ప్రీతి సింగ్ పంజాబీ. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉన్న పార్వతి భరత నాట్యంలో శిక్షణ పొందారు. అలాగే ఫిగర్ స్కేటింగ్‌ లో కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నారు.

మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె 2004లో మిస్ టీన్ ఇండియా బే ఏరియా టైటిల్ గెలుచుకున్నారు. తర్వాత 2005లో మిస్ ఇండియా లె విసాజ్ యూఎస్ఏ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో వెన్నెల మూవీతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత గేమ్, మధుమాసం, అల్లరే అల్లరి వంటి చిత్రాల్లో నటించి చేరువయ్యారు. 2012లో పెళ్లి తర్వాత పార్వతి సినిమాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి పెద్దగా పబ్లిక్‌ లో కనిపించలేదు. ఇప్పుడు సడెన్ గా ఫోటో షూట్ తో షాకిచ్చారు!

Tags:    

Similar News