ఈసారి మణిరత్నం ప్రేమ.. కొత్తగా ఉంటుందా?

ఇండియన్ సినిమా రేంజ్ ను పెంచిన దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2026-07-27 06:54 GMT

ఇండియన్ సినిమా రేంజ్ ను పెంచిన దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన టేకింగ్, కథ చెప్పే విధానం ఇండస్ట్రీలో ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ లెజెండరీ డైరెక్టర్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్ లో ఒక కథను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని మేకింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి.

కోల్ కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జి మీద ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లీకైన ఫోటోల్లో లీడ్ పెయిర్ లుక్స్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విజయ్ సేతుపతి తన పాత సినిమాలకు పూర్తి భిన్నంగా చాలా ట్రిమ్ గా మారిపోయి ఒక కొత్త మేకోవర్ లో కనిపించాడు. ఇక సాయి పల్లవి లాంగ్ ప్లీటెడ్ స్లీవ్ లెస్ డ్రెస్ లో చాలా సింపుల్ గా, క్యూట్ గా కనిపించింది. కొన్ని స్టిల్స్ లో ఆమె చీరకట్టులో కూడా మెరిసినట్లు సమాచారం.

అక్కడ జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ను ప్లాన్ చేసి షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్టిల్స్ చూశాక సోషల్ మీడియాలో ఒక కొత్త డిస్కషన్ మొదలైంది. మణిరత్నం ఇంకా తన పాత ఫార్ములానే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. కేవలం కొన్ని లొకేషన్ ఫోటోలను బట్టి సినిమా కథను పూర్తిగా అంచనా వేయలేము.

కానీ ఈమధ్య కాలంలో ఆయన తీస్తున్న ప్రేమ కథల్లో తన పాత సినిమాల్లోని ఫీల్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు వర్కౌట్ అయిన ఆ టేకింగ్ ఇప్పుడు ఈ కాలం ఆడియన్స్ కు కాస్త రొటీన్ గా అనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఓటీటీల రాకతో గ్లోబల్ కంటెంట్ చూస్తున్న నేటి తరం ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం అంత ఈజీ కాదు. స్క్రీన్ మీద ఒక లవ్ స్టోరీ చూడాలంటే అందులో కచ్చితంగా ఏదో ఒక కొత్త తరహా ఫీల్ ఉండాలని యూత్ కోరుకుంటున్నారు.

రెగ్యులర్ ఎమోషన్స్, పాతకాలపు రొమాంటిక్ ట్రాక్స్ తో వస్తే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం అంత ఈజీ కాకపోవచ్చు. ఈ విషయాన్ని మణిరత్నం లాంటి క్రేజీ క్రియేటర్లకు తెలియకుండా ఉండదు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమా కేవలం ఒక నార్మల్ లవ్ స్టోరీగా మాత్రమే వస్తుందా లేక అందులో ఏదైనా పవర్ ఫుల్ ఎలిమెంట్ దాగి ఉందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

లీడ్ పెయిర్ ఇద్దరూ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లనే ఎంచుకుంటారు. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ కథలో కచ్చితంగా ఏదో ఒక సాలిడ్ పాయింట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి మణిరత్నం మార్క్ విజన్ తోడైతే సినిమా అవుట్ పుట్ చాలా కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది. మరి మణిరత్నం తన మేకింగ్ స్టైల్ ను ఏమైనా అప్డేట్ చేసుకున్నారా లేదా అనేది రాబోయే రోజుల్లో అప్డేట్స్ వస్తే కానీ క్లారిటీ రాదు.

Tags:    

Similar News