నేషనల్ అవార్డుల రచ్చ.. ధనుష్ లాజికల్ లెక్క

అయితే ఈ ట్రోల్స్ పై ధనుష్ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2026-07-27 06:18 GMT

రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్ నడుస్తోంది. రాయన్ లాంటి యాక్షన్ సినిమాకు అవార్డు ఇవ్వడం ఏంటని ఓ వర్గం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆ ఏడాది కంటెంట్ పరంగా చూసుకుంటే మెయ్యళగన్, మహారాజ లాంటి సూపర్ సినిమాలు వచ్చాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి రాయన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వడంపై తమిళ ఆడియన్స్ తో పాటు మన వాళ్లు కూడా కాస్త డిస్సపాయింట్ అయ్యారు. అయితే ఈ ట్రోల్స్ పై ధనుష్ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మామూలుగా తమ సినిమాకు అవార్డు వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే డిఫెండ్ చేసుకుంటారు. కానీ ధనుష్ అలా చేయలేదు. రాయన్ కంటే మెయ్యళగన్, మహారాజ సినిమాలు చాలా బెటర్ అని పబ్లిక్ గా ఒప్పుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. తన సినిమా కంటే పక్కవాళ్ల సినిమాలు బాగున్నాయని ఒక స్టార్ హీరో యాక్సెప్ట్ చేయడం నిజంగా గ్రేట్. అక్కడితో ఆగకుండా తనను ట్రోల్ చేస్తున్న వాళ్లకు ఒక సాలిడ్ క్వశ్చన్ వేశాడు.

గతంలో ధనుష్ యాక్టింగ్ ఇరగదీసిన సినిమాలు చాలానే వచ్చాయి. వడ చెన్నై, కర్ణన్, మర్యాన్, 3, రాంజనా, పుదుపేట్టై లాంటి సినిమాలు ఆడియన్స్ కు ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ కు నేషనల్ అవార్డు పక్కా అని అప్పట్లో అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ జ్యూరీ వాళ్లు మాత్రం అప్పుడు ఆ సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా ఇదే పాయింట్ ను పట్టుకుని ధనుష్ అడిగిన లాజికల్ క్వశ్చన్ కు విమర్శకుల దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది.

నేను ప్రాణం పెట్టి చేసిన బెస్ట్ సినిమాలకు అవార్డులు రానప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు అని ధనుష్ అడిగిన విధానం అందరినీ ఆలోచింపజేస్తోంది. గతంలో తన యాక్టింగ్ కు సరైన గుర్తింపు దక్కనప్పుడు పది శాతం జనాలు కూడా అండగా నిలబడలేదని.. కట్ చేస్తే ఇప్పుడు రాయన్ కు అవార్డు రాగానే దాదాపు తొంభై శాతం మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారని ధనుష్ తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. ఒక యాక్టర్ గా తన బెస్ట్ వర్క్ కు గుర్తింపు రానప్పుడు ఆయన ఎంత ఫీల్ అయ్యాడో ఈ మాటలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

ధనుష్ చెప్పిన మాటల్లో నిజం ఉందని ఆయన ఫ్యాన్స్ కూడా గట్టిగానే వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన పాత సినిమాలన్నీ ఇప్పుడు పక్కా కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. అప్పట్లో ఆ సినిమాలకు కచ్చితంగా అవార్డులు రావాల్సింది. కానీ టైం వచ్చినప్పుడు ఆ రికగ్నిషన్ దక్కలేదు. ఇప్పుడు సడెన్ గా వేరే సినిమాకు అవార్డు వచ్చేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ధనుష్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఆయన బాధలో కూడా ఒక అర్థం ఉందని సామాన్య ప్రేక్షకులకు కూడా క్లారిటీ వస్తోంది.

ఏదేమైనా అవార్డులు అనేవి జ్యూరీ వాళ్ల డెసిషన్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ల లెక్కలు అందరికీ నచ్చాలని రూల్ లేదు. అలాగని ఒక యాక్టర్ ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని పూర్తిగా తీసిపారేయలేం. ధనుష్ లాంటి టాలెంటెడ్ హీరోకు అవార్డు వచ్చినప్పుడు, దాన్ని ఆయన ఓవరాల్ కెరీర్ కు దక్కిన గౌరవంగా చూస్తే సరిపోతుంది. మొత్తానికి ఎక్కడా అగ్రెసివ్ అవ్వకుండా, కూల్ గా ఒకే ఒక్క లాజికల్ ఆన్సర్ తో ధనుష్ ఈ నేషనల్ అవార్డుల రచ్చకు ఎండ్ కార్డ్ వేశాడని చెప్పాలి.

Tags:    

Similar News