వెంకీ ఆదర్శ కుటుంబం గ్లింప్స్.. ఎలా ఉందంటే..
ఇందులో వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా ఒక సాధారణ కుటుంబ పెద్ద పాత్రలో కనిపించనున్నారు. భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తోంది.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం-హౌస్ నెం. 47 సినిమా నుంచి కొత్త గ్లింప్స్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మేకర్స్ ఒక ఫన్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిట్టిబాబు క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ చూస్తుంటే వెంకీ మార్క్ కామెడీ మళ్లీ స్క్రీన్ మీద చూడబోతున్నామని అర్థమవుతోంది.
అప్పుడే కొత్తగా ఇల్లు చూస్తున్న జంటగా వెంకీ శ్రీనిధి కనిపించారు. కిచెన్ లో ఏసీ.. నువ్వు వంట చేసేటప్పుడు ఏసీ వేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు కదా అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి సరదాగా అంటుంది. దానికి వెంకటేష్ చాలా స్టైలిష్ గా ఎస్, ఐ యామ్ ది మ్యాన్ ఆఫ్ ది హౌస్ అని చెప్పడం హైలెట్ అవుతోంది. వాషింగ్ మిషన్ కూడా ఉంది కాబట్టి నీకు పని బాగా తగ్గిపోయినట్లే అని వెంకటేష్ ఫీల్ అవుతుంటాడు. నిజానికి ఇంట్లో వంటల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ అతనే చేసుకుంటూ, తనను తాను బాస్ గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ లో వెంకీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇదే గ్లింప్స్ లో రఘు బాబుతో వెంకటేష్ చెప్పే డైలాగ్స్ సినిమాకు మరో హైలైట్. ఇంట్లో ఎవరేం పని చేసినా నచ్చదని, అందుకే అన్నీ తానే చూసుకుంటానని చిట్టిబాబు అనడం.. దానికి రఘు బాబు కౌంటర్ ఇస్తూ, ఆవిడకు ఏమీ రాదు కాబట్టి అన్నీ మీరే చేసుకుంటారని అర్థమైంది అనడం చూస్తుంటే కామెడీ యాంగిల్ ను గట్టిగానే టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిన్న డైలాగ్ ఎక్స్చేంజ్ తోనే సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందో త్రివిక్రమ్ హింట్ ఇచ్చారు. అలాగే నారా రోహిత్ ఆదర్శ కుటుంబం అని చెప్పడం మరో హైలెట్. అతని పాత్ర సినిమా కథలో చాలా కీలకం అని తెలుస్తోంది.
ఇందులో వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా ఒక సాధారణ కుటుంబ పెద్ద పాత్రలో కనిపించనున్నారు. భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ చూస్తుంటే స్క్రీన్ మీద ఏదో కొత్త మ్యాజిక్ చేయబోతున్నారనిపిస్తోంది. ఇక సినిమా కథలో ఎప్పుడూ ఇంటి పనులతో బిజీగా ఉండే ఒక సగటు భర్త పాత్రలో వెంకటేష్ కనబరిచిన హావభావాలు ప్రతి ఒక్కరికీ ఈజీగా కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అప్డేట్ గా శ్రీనిధి శెట్టికి సంబంధించిన స్వర్ణ క్యారెక్టర్ ను కూడా పూర్తి స్థాయిలో పరిచయం చేయబోతున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యువిన పార్వతి సంపూర్ణ పాత్రలో, రాజ్ ప్రజ్వల్ శర్వ పాత్రలో అలరించనున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తోంది.
గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పని చేసి వెంకటేష్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఈ ఆదర్శ కుటుంబం చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఆడియన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి.