మనం కొట్టినం.. రష్మికతో విజయ్ ఇలా..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాతో నేడు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాతో నేడు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా లెవెల్‌లో, విడుదలకు ముందు నుంచే అద్భుతమైన బజ్‌ను సొంతం చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై గ్రాండ్‌గా రూపొందింది. ముఖ్యంగా ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీంతో థియేటర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతూ, బిగ్ ఓపెనింగ్‌కి ట్రాక్ సెట్ చేసింది.
ప్రేక్షకుల్లో మంచి హైప్‌తో పాటు, విజయ్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత కొన్ని సినిమాల్లో ఫామ్ కొంత తగ్గినా, ‘కింగ్‌డమ్’తో విజయ్ బుకింగ్స్ ద్వారా తన మార్క్‌ను తిరిగి నిలబెట్టాడు. చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమాపై పాజిటివ్ వేవ్‌ని తీసుకొచ్చాయి. దేశ విదేశాల్లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్‌గా రావడంతో, ఓపెనింగ్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, సినిమాకు మరింత స్పెషల్ హైప్ తీసుకొచ్చిన మూమెంట్... విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ. ఇప్పటికే రష్మిక, విజయ్ రిలేషన్షిప్స్ పై రూమర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే, ఆమె చేసిన ట్వీట్‌కి విజయ్ ఇచ్చిన క్యూట్ రిప్లై నెట్టింట వైరల్ అయింది. రష్మిక తన ట్వీట్‌లో "నాకు తెలుసు ఈ విజయం నీకు, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఎంతగా ముఖ్యమో" అని తన వివరణ ఇచ్చింది.
అంతే కాకుండా విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ ‘మనం కొట్టినం’ అంటూ తెలుగు, ఇంగ్లీష్ కలిపి ట్వీట్ చేసింది. వెంటనే విజయ్ దేవరకొండ కూడా.. మనం కొట్టినం.. అంటూ తెలుగులోనే క్యూట్‌గా రిప్లై ఇచ్చాడు. మరో హైలెట్ ఏమిటంటే.. ఇద్దరి ట్వీట్స్ లో లవ్ ఎమోజీ ఉండడం. దీంతో ఫ్యాన్స్ కూడా వారి కామెంట్స్ ను వైరల్ అయ్యేలా రియాక్షన్స్ ఇస్తున్నారు.
ఈ ట్వీట్ ద్వారా ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేక బాండింగ్ మరోసారి బయటపడింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్‌ల్లో కాంబోగా హిట్ ఇచ్చిన ఈ జంట అప్పుడప్పుడూ పబ్లిక్‌గా ఇలా కనెక్ట్ కావడం అభిమానులలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రష్మిక ట్వీట్ చేసిన వెంటనే లక్షల్లో లైక్స్, వేలల్లో షేర్‌లు, కమెంట్స్ వచ్చాయి. మనం కొట్టినం.. అనే పదం కూడా ట్రెండింగ్ గా నిలుస్తోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. ట్రెయిలర్, సాంగ్స్‌తోనే అంచనాలు పెరిగిన చిత్రానికి, సోషల్ మీడియా నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, విజయ్ రష్మిక ట్విట్టర్ సంభాషణ సినిమా ప్రమోషన్‌కు స్పెషల్ బూస్ట్ ఇచ్చింది. ఇక, ఫస్ట్ డే కలెక్షన్లు రూ.17–19 కోట్లు ఉండొచ్చన్న అంచనాలు, నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ దాటి రికార్డ్‌లు సెట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ బలంగానే వినిపిస్తోంది.